iFFalcon K61 స్మార్ట్ టీవీలు విడుదల అయ్యాయి!!! అందుబాటు ధరలోనే...
TCL యాజమాన్యంలోని IFFalcon సంస్థ K61 సిరీస్ పేరుతో ఇండియాలో కొత్తగా 4K స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. IFFalcon K61 4K TV సిరీస్‌లో 43-అంగుళాలు, 50-అంగుళాలు మరియు 55-అంగుళాల స్క్రీన్ పరిమాణాలతో మూడు మోడళ్లను విడుదల చేసింది. ఈ టీవీలు బడ్జెట్ ధరలలో రూ.24,999 నుండి ప్రారంభమవుతాయి. ఈ బడ్జెట్ విభాగంలో షియోమి, రియల్ మి, మోటరోలా మరియు వన్‌ప్లస్ వంటి సంస్థలతో తీవ్రమైన గట్టి పోటీని కలిగి ఉంది. ఈ సంస్థ యొక్క కొత్త స్మార్ట్ టీవీల యొక్క ఫీచర్స్ మరియు ధరల వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iFFalcon K61 స్మార్ట్ టీవీ 4K అప్‌స్కేలింగ్ స్పెసిఫికేషన్స్
iFFalcon K61 స్మార్ట్ టీవీలు 43-అంగుళాలు, 50-అంగుళాలు మరియు 55-అంగుళాలు వంటి మూడు స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే 4K రెసొల్యూషన్ తో 3,840x2,160 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉండి ఆండ్రాయిడ్ టీవీ 9 పై రన్ అవుతుంది అలాగే రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్ టీవీ 10 యొక్క అప్ డేట్ ను పొందే అవకాశం కూడా ఉంది. ఇది 4K అప్‌స్కేలింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంటే మీరు 4K కంటెంట్‌ను చేయని వాటిని ప్లే చేసిన కూడా పిక్చర్ మరియు వీడియో నాణ్యతను అన్ని కోణాల నుండి మెరుగు చేస్తుంది. దీని యొక్క డిస్ప్లే 1,296 మైక్రో డిమ్మింగ్ జోన్లతో మరియు HDR10 మద్దతుతో వస్తుంది.

iFFalcon K61 స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ ఫీచర్స్
iFFalcon K61 కొత్త స్మార్ట్ టీవీల హార్డ్‌వేర్ విషయానికి వస్తే 24W అవుట్పుట్ ఆడియో కోసం రెండు 12W స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ ను కూడా కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మద్దతును కలిగి ఉండడంతో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరెన్నో గూగుల్ ప్లే యాప్ లకు యాక్సిస్ లభిస్తుంది. లైట్లు, AC వంటి మరిన్ని IoT పరికరాలను నియంత్రించడానికి కూడా iFFalcon K61 టీవీలను ఉపయోగించవచ్చు.

iFFalcon K61 స్మార్ట్ టీవీ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఫీచర్స్
iFFalcon K61 స్మార్ట్ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతున్నట్లు ఐఎఫ్‌ఫాల్కాన్ ధృవీకరించింది. ఇది 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఆండ్రాయిడ్ టీవీని బూట్ చేస్తున్నందున గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్ లు ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి.

iFFalcon K61 స్మార్ట్ టీవీల ధరల వివరాలు
iFFalcon K61 4K స్మార్ట్ టివిలు మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో విడుదల అయ్యాయి. ఇందులో 43-అంగుళాల స్క్రీన్ పరిమాణం గల టీవీ యొక్క ధర 24,999 రూపాయలు, అలాగే 50-అంగుళాల మోడల్ ధర రూ.30,499 కాగా చివరిది 55-అంగుళాల మోడల్ యొక్క ధర రూ.36,999. ఈ మూడు టీవీలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








