Home
Gadgets

ఇండియాలో తక్కువ ధరకు లభించే స్మార్ట్ టీవీ ఇదే! ధర రూ.6799 మాత్రమే!

By Maheswara

కేవలం రూ.6,799 ధర కి మీరు కొత్త స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చని చెబితే మీరు నమ్ముతారా? అవును,ఇది నిజమే,ప్రస్తుత కాలంలో సరసమైన ధరలో పెద్ద సైజు టీవీని కొనుగోలు చేసేందుకు భారతదేశంలోని ప్రజలు ఆసక్తి చూపుతున్న మాట వాస్తవమే. ఇటువంటి సమయంలో స్మార్ట్ టీవీ లను అతి తక్కువ ధరకు లాంచ్ చేయడం చెప్పుకోదగ్గ విషయం.

భారతీయ వినియోగదారులను సంతోషపెట్టే లక్ష్యంతో, ఇన్ఫినిక్స్ ఇప్పుడు చాలా సరసమైన ధరలో కొత్త టీవీని విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ తన Y1 సిరీస్ స్మార్ట్ టీవీలను ఇప్పుడే విస్తరించింది. ముఖ్యంగా, బ్రాండ్ గత సంవత్సరం 32-అంగుళాల మరియు 43-అంగుళాల Y1 టీవీలను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు కంపెనీ 24Y1, 24 అంగుళాల కాంపాక్ట్ మరియు చాలా సరసమైన స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది.

Infinix 24Y1 Smart Tv Priced At Rs.6799 Launched In India With Linux OS. Specifications Details In Telugu

ఇన్ఫినిక్స్ 24Y1 TV ధర ఎంత?

ఇంతకు ముందు ఇన్ఫినిక్స్ లాంచ్ చేసిన 32" అంగుళాల TV మోడల్ రూ.10,000 ధర లోపు వచ్చింది. ఇప్పుడు కంపెనీ 24 అంగుళాల కాంపాక్ట్ టీవీని మరింత తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. ధర మరియు స్పెసిఫికేషన్ల ముఖ్యాంశాలను ఇప్పడు చూద్దాం.

భారతదేశంలో ఇన్ఫినిక్స్ 24Y1 TV ధర రూ. 6,799 కి లాంచ్ చేయబడింది. అవును, మీరు చదివింది నిజమే. ఈ కొత్త 24" అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు కేవలం రూ. 6,799కి కొనుగోలు చేయడానికి మీకు అందుబాటులో ఉంది. ఇది అత్యంత సరసమైన స్మార్ట్ టీవీలలో ఒకటి. ఈ కొత్త టీవీ మార్చి 15 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Infinix 24Y1 Smart Tv Priced At Rs.6799 Launched In India With Linux OS. Specifications Details In Telugu

ఇన్ఫినిక్స్ 24Y1 TV యొక్క ముఖ్యమైన ఫీచర్లు
ఇన్ఫినిక్స్ 24Y1 టీవీ 1366 x 768 పిక్సెల్‌ల HD రిజల్యూషన్‌తో 24" అంగుళాల డిస్‌ప్లే సైజును కలిగి ఉంది.ఇన్ఫినిక్స్ సంస్థ ప్రకారం, ఈ డిస్‌ప్లే ప్యానెల్ 250 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వీడియో నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీ HLG సపోర్ట్‌ను కూడా ఉపయోగించింది. దీనికి బ్లూ లైట్ ఫీచర్ కూడా ఉంది. చూసే వారి కళ్లను రక్షించడానికి ఎమిషన్ ప్రొటెక్టివ్ ఐ కేర్ ఫీచర్ కూడా ఇందులో అందించబడింది.

ఇక ఆడియో నాణ్యత వివరాలు గమనిస్తే, ఈ ఇన్ఫినిక్స్ 24Y1 TV స్మార్ట్ టీవీ 16W ఆడియో అవుట్‌పుట్‌తో రెండు 16W బాక్స్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీతో ఆడియో ట్యూన్ చేయబడింది. ఇది వివిధ సౌండ్ మోడ్‌లతో నాణ్యమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇక పనితీరు పరంగా, ఇన్ఫినిక్స్ 24Y1 TV క్వాడ్-కోర్ చిప్‌సెట్‌ ప్రాసెసర్ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ విషయంలో ముందు, ఇన్ఫినిక్స్ 24Y1 TV దాని వినియోగదారులకు అనేక పోర్ట్‌లను అందిస్తుంది. ఇందులో రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, AV ఇన్‌పుట్, హెడ్‌ఫోన్ జాక్, COAX అవుట్, LAN మరియు Wi-Fi కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. టీవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ కోసం హాట్‌కీలతో రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఈ కొత్త ఇన్ఫినిక్స్ 24Y1 TV మోడల్ లాంచ్ స్పెసిఫికేషన్‌లు ప్రాథమికంగా 32Y1 మోడల్‌తో సమానంగా ఉంటాయి. అయితే, స్పీకర్లు 20W నుండి 16Wకి తగ్గించబడ్డాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix 24Y1 Smart Tv Priced At Rs.6799 Launched In India With Linux OS. Specifications Details In Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X