బెస్ట్‌ ధ‌ర‌లో INFINIX 4K QLED టీవీ భార‌త్‌లో విడుద‌ల‌!

|

ప్ర‌స్తుతం మార్కెట్లో ర‌క‌ర‌కాల 4K టెలివిజన్‌లు అతి త‌క్కువ ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. తాజాగా, INFINIX అనే కంపెనీ స‌ర‌స‌మైన ధ‌ర‌లో మ‌రో 4K టీవీని భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Infinix కంపెనీ భారతదేశంలో 55-అంగుళాల 4K QLED పేరుతో కొత్త‌ టీవీని ప్రారంభించింది. కంపెనీ దీనిని జీరో 55-అంగుళాల QLED 4K TV అని పిలుస్తోంది. ఈ టీవీ అందుబాటు ధ‌ర‌లో అనేక గొప్ప ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను క‌లిగి ఉంది. ఇప్పుడు ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

 
బెస్ట్‌ ధ‌ర‌లో INFINIX 4K QLED టీవీ భార‌త్‌లో విడుద‌ల‌!

భారతదేశ మార్కెట్లో INFINIX 4K QLED టీవీ ధర:
Infinix ఇప్ప‌టివ‌ర‌కు రెండు మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మొద‌టిది Infinix 50X3 4K టీవీ.. దీని ధర రూ.24,990 గా నిర్ణ‌యించింది. ఇక రెండోది Infinix Zero 55-అంగుళాల QLED 4K TV దీని ధ‌ర‌ను రూ. 34,990 గా నిర్ణ‌యించింది. రెండు టీవీలు దేశంలో వచ్చే వారం అమ్మకానికి రానున్నాయి.

INFINIX 4K QLED టీవీ స్పెసిఫికేషన్‌లు:
ఈ టీవీకి సంబంధించి స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. ఈ టీవీ 55 అంగుళాల డిస్‌ప్లేను క‌లిగి ఉంది. 4K QLED ప్యానెల్ అందిస్తున్నారు. అంతేకాకుండా, Infinix కంపెనీ ఈ మోడల్ కోసం ప్రీమియం డిజైన్‌పై దృష్టి సారించినట్లు పేర్కొంది. ఇది స్క్రీన్‌పై 1.6mm బెజెల్‌లను మరియు టీవీకి మంచి లుక్ అందించే x-బ్లేడ్ మెటల్ స్టాండ్‌ను కలిగి ఉంటుంది. డాల్బీ విజన్ ఫీచ‌ర్‌తో వస్తుంది మరియు హై-డెఫినిష‌న్‌ వీక్షణ అనుభవం కోసం HDR10+కి మద్దతు ఇస్తుంది. ఇది 400 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.

బెస్ట్‌ ధ‌ర‌లో INFINIX 4K QLED టీవీ భార‌త్‌లో విడుద‌ల‌!

ఈ టీవీ 2GB RAM మరియు 16GB స్టోరేజ్‌తో కూడిన MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Infinix కంపెనీ ఈ 4K TVలో Android TV 11 వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఈ TV మూడు HDMI పోర్ట్‌లను కలిగి ఉంది. ఇంకా.. కనెక్టివిటీ కోసం ARC, రెండు USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, LAN పోర్ట్, Wi-Fi మరియు హెడ్‌ఫోన్ జాక్‌లకు మద్దతు ఉంది. అంతేకాకుండా, డాల్బీ అట్మోస్ కోసం ఆప్టిమైజ్ చేసిన రెండు 36W బాక్స్ స్పీకర్లు మరియు ట్వీటర్‌లను పొంద‌వ‌చ్చు.

బెస్ట్‌ ధ‌ర‌లో INFINIX 4K QLED టీవీ భార‌త్‌లో విడుద‌ల‌!

అదేవిధంగా, భార‌త్‌లో INFINIX కంపెనీ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన‌ Infinix Note 12 Pro మొబైల్ గురించి కూడా తెలుసుకుందాం:
Infinix Note 12 Pro 4G స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది డిస్‌ప్లేపై వాట‌ర్ డ్రాప్ స్టైల్‌లో నాచ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది XOS 10.6 ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of RAM+256GB స్టోరేజీ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 108-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.75 అప‌ర్చ‌ర్‌తో వ‌స్తున్న ప్రైమ‌రీ కెమెరా ఈ మొబైల్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఇక మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి డెప్త్ లెన్స్‌, మ‌రొక‌టి ఏఐ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

 

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్ క‌లిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. Wi-Fi, బ్లూటూత్, హెడ్‌ఫోన్ పోర్ట్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. DTS టెక్నాలజీ ద్వారా మెరుగుపరచబడిన డ్యూయల్ స్పీకర్లను స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. మంచి గేమింగ్ అనుభవం కోసం 4D వైబ్రేషన్‌తో లీనియర్ మోటార్ టాక్టైల్ సిస్టమ్ కూడా ఉంది. Infinix Note 12 Pro ఏకైక 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధ‌ర‌ రూ.16,999 కు అందుబాటులో ఉంది. ఈ Infinix స్మార్ట్‌ఫోన్ ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ మరియు వోల్కానిక్ గ్రే క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
INFINIX 4K QLED smart tv launched in india. know the price details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X