Infinix నుంచి తక్కువ ధరలో శక్తివంతమైన Laptop లు! సేల్ మొదలైంది
Infinix సంస్థ భారతదేశంలో తన తాజా బడ్జెట్ ల్యాప్‌టాప్ లను గత వారం విడుదల చేసింది. ఈ ఇన్ఫినిక్స్ INBook X2 స్లిమ్ ల్యాప్ టాప్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది మొత్తం 6 వేరియంట్లలో వస్తుంది. గత వారం విడుదలైన ఈ ల్యాప్‌టాప్ కోసం భారత మార్కెట్లో ఈరోజు (జూన్ 9) అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ 1TB వరకు స్టోరేజీ, 16GB వరకు ర్యామ్, అల్యూమినియం అల్లాయ్ ఫినిషింగ్ మరియు బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో వస్తుంది. ఇది మొత్తం 6 వేరియంట్‌లలో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ X2 స్లిమ్ ల్యాప్‌టాప్ యొక్క ముఖ్యమైన ఫీచర్లు: ఇన్ఫినిక్స్ నుండి వచ్చిన ఈ తాజా ల్యాప్‌టాప్ 1080 x 1920 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 14 అంగుళాల పూర్తి HD డిస్ప్లే (14inch FHD డిస్ప్లే)ని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 300 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కూడా అందిస్తుంది.
ముందే చెప్పుకున్నట్టు ఈ ల్యాప్ టాప్ మొత్తం 6 వేరియంట్లలో విడుదలైంది. అవి 11వ తరం ఇంటెల్ కోర్ i3, ఇంటెల్ కోర్ i5 మరియు ఇంటెల్ కోర్ i7 చిప్‌సెట్‌లతో విభిన్న RAM + స్టోరేజీ ఆప్షన్లలో వస్తాయి.
ఇక ఈ ల్యాప్‌టాప్ యొక్క RAM మరియు స్టోరేజీ విషయానికొస్తే, ఇది రెండు RAM ఎంపికలు (8GB, 16GB) మరియు 3 స్టోరేజీ ఎంపికలు (256GB, 512GB మరియు 1TB)లలో వస్తుంది. అలాగే Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బడ్జెట్ ధర కలిగిన ఈ ల్యాప్‌టాప్ అందుబాటు ధరలోనే లభిస్తుంది.ఇంకా, వీడియో కాలింగ్ కోసం డ్యూయల్-స్టార్ LED ఫిల్ లైట్లతో HD వెబ్‌క్యామ్ కూడా ఉంది. ఇది స్టీరియో స్పీకర్లు మరియు DTS ఆడియో ప్రాసెసింగ్‌తో కూడిన 2 డిజిటల్ మైక్రోఫోన్‌లను కూడా కలిగి ఉంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ వివరాలు గమనిస్తే, ఈ ల్యాప్‌టాప్ 65W PD 3.0 టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 50Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ రెడ్, గ్రీన్, సిల్వర్ మరియు బ్లూ అనే 4 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ ధరల వివరాలు: i3 ప్రాసెసర్‌తో కూడిన 8GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 29,990. అదే i3 ప్రాసెసర్ మరియు 8GB RAM + 512GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.31,990 గా ఉంది
అలాగే, i5 ప్రాసెసర్‌తో 16GB RAM + 512GB వేరియంట్ ధర రూ. 38,990. అదే i5 ప్రాసెసర్ మరియు 16GB RAM + 1TB స్టోరేజ్‌తో Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ ధర రూ. 40,990 గా ఉంది.
చివరగా, i7 ప్రాసెసర్‌తో కూడిన 16GB RAM + 512GB వేరియంట్ ధర రూ. 48,990. అదే i7 ప్రాసెసర్ మరియు 16GB RAM + 1TB స్టోరేజ్‌తో Infinix Inbook X2 స్లిమ్ ల్యాప్‌టాప్ ధర రూ. 50,990 గా ఉంది.


Click it and Unblock the Notifications