Home
Gadgets

రూ.10,999కే 32 అంగుళాల HD టీవీ.. సేల్‌, ఫీచర్ల వివరాలు

Infinix సంస్థ భారత్‌లో W1 సీరిస్‌ టీవీలను లాంచ్‌ చేసింది. WebOS ఆధారంగా పనిచేసే బడ్జెట్‌ ధరలో నాణ్యమైన టీవీలను విడుదల చేసింది. 32 అంగుళాల HD TV మరియు 43 అంగుళాల 4K TVలు అందుబాటులోకి వచ్చాయి. రెండు QLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరల్లో, అత్యుత్తమ ఫీచర్లతో టీవీలు లాంచ్‌ చేయడం ద్వారా మార్కెట్లో సముచిత స్థానం సంపాదించుకుంటుంది.

Infinix W1 QLED 32 అంగుళాల టీవీ (1366*768) HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90% NTSC వైడ్‌ కలర్‌, గేమ్‌ డ్యాష్‌బోర్డ్ ఆప్టిమైజేషన్‌తో వస్తుంది. 43 అంగుళాల (3840*2160) QLED TV 4K సపోర్టు చేస్తుంది. 94% NTSC వైడ్‌ కలర్‌, గేమ్‌పోర్టు ఆప్టిమైజేషన్‌తోనూ వస్తుంది. మరియు HRD10 కు మద్దతు ఇస్తుంది.

Infinix launched W1 QLED series TV

ఇన్ఫినిక్స్‌ W1 సీరిస్‌ టీవీల్లో డిస్‌ప్లేలో కొన్ని మార్పులు ఉంటాయి. అయితే చాలా వరకు ఇతర ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండు 32 అంగుళాల HD టీవీ, 43 అంగుళాల 4K టీవీ వేరియంట్లు webOS, IMG BXE4 GPU గ్రాఫిక్స్‌ కార్డుతో కూడిన క్వాడ్‌ కోర్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. మరియు రెండు టీవీలు 1GB ర్యామ్, 8GB అంతర్గత స్టోరేజీతో వస్తాయి.

ఇన్ఫినిక్స్‌ తాజాగా విడుదల చేసిన రెండు వేరియంట్ల టీవీలు యూట్యూబ్‌, ఆపిల్‌ ఎయిర్ ప్లే మరియు ఆపిల్‌ హోమ్‌ యాప్‌లు సపోర్టు చేస్తాయి. నెట్‌ఫిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ సహా ఇతర ఓటీటీ యాప్‌లు ముందస్తు ఇన్‌స్టాల్‌తో రానున్నాయి.

Infinix W1 QLED 4K 4k మోడల్‌ ఎయిర్‌ మౌస్‌, వీల్‌ కంట్రోల్‌ మరియు యూనివర్సల్‌ కంట్రోల్‌ కూడిన మ్యాజిక్‌ రిమోట్‌తో వస్తుంది. అంటే వాయిస్‌ ద్వారా కూడా టీవీని నియంత్రించవచ్చు. నావిగేషన్‌ వేగంగా మరియు సులభంగా చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. అదే HD మోడల్‌ టీవీలో IR రిమోట్‌ను కలిగి ఉంటుంది.

ఈ టీవీ డ్యూయల్‌ బ్యాండ్‌ Wi-Fi, 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, ఒక RF ఇన్‌పుట్‌, ఏవీ ఇన్‌పుట్‌ మరియు హెడ్‌ ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంటుంది. డాల్బీ ఆడియో 20W స్పీకర్లను ఈ రెండు టీవీలు కలిగి ఉంటాయి.

ఇన్ఫినిక్స్‌ 32 అంగుళాల HD మోడల్‌ ధర రూ.10,999 అందుబాటులోకి రానుంది. అదే 43 అంగుళాల 4k మోడల్‌ ధర రూ.20,999 ఉంది. ఈ రెండు టీవీలు ఆగస్టు 2 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix launched W1 QLED series TV in india will sale from august
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X