Home
Gadgets

8K వీడియోతో అదరగొట్టే కొత్త 360° యాక్షన్ కెమెరాతో వచ్చేసిన Insta360 X5..!

టెక్నాలజీ ప్రియులకు, ముఖ్యంగా యాక్షన్ కెమెరాలను ఇష్టపడేవారికి శుభవార్త. ప్రముఖ ఇన్‌స్టా360 కంపెనీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ 360° యాక్షన్ కెమెరా Insta360 X5ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన క్వాలిటీతో ఈ కెమెరా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇంతకుముందు వచ్చిన X4 మోడల్ కు కొనసాగింపు (Successor).

వీడియో క్వాలిటీ, తక్కువ వెలుతురులో పనితీరు, AI స్మార్ట్ ఫీచర్లలో భారీ మెరుగుదలలతో ఈ X5 వచ్చింది. కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లు, సాహసాలు చేసేవారు (Adventure Seekers), ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ చిన్న కెమెరాను రూపొందించారు. దీని క్వాలిటీ చాలా బాగుంటుంది.

Insta360 X5 Launched  Powerful New 8K 360 AI Action Camera Sets New Standard

* పవర్ ఫుల్ కొత్త సెన్సార్, అదిరే AI ఇంజన్
ఈ X5 కెమెరాలో పెద్ద 1/1.28-అంగుళాల సెన్సార్లు వాడారు. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా కెమెరా ఎక్కువ కాంతిని గ్రహించి, ఫోటోలు, వీడియోలు మరింత బ్రైట్‌గా, క్లియర్‌గా వస్తాయి. ఈ కెమెరాతో మీరు 8K రిజల్యూషన్‌లో 360° వీడియోను సెకనుకు 30 ఫ్రేమ్‌ల (fps) చొప్పున రికార్డ్ చేయొచ్చు.

అలాగే, 5.7K వీడియోను సెకనుకు 60 ఫ్రేమ్‌ల చొప్పున HDRలో కూడా తీయొచ్చు. ఇందులో శక్తివంతమైన ట్రిపుల్ AI చిప్ సిస్టమ్ ఉంది. ఒక 5nm AI చిప్, రెండు ప్రో ఇమేజింగ్ చిప్‌లు కలిసి పనిచేస్తాయి. దీనివల్ల ప్రాసెసింగ్ పవర్ ఏకంగా 140% పెరిగింది.

ఈ అప్‌గ్రేడ్ తో చీకటి ప్రదేశాల్లో తీసే వీడియోలలో నాయిస్ (Noise) తగ్గి, డైనమిక్ రేంజ్ మెరుగవుతుంది. ఇందుకోసం కొత్తగా AI-పవర్డ్ PureVideo మోడ్ ను పరిచయం చేసారు.ఈ కెమెరాను ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా గట్టిగా తయారు చేసారు.

* ఇది ఎంత గట్టిదంటే..
ఈ కెమెరా లెన్స్ గ్లాస్ అంత సులభంగా పగలదు (Damage-resistant). అంతేకాదు, ఈ కేటగిరీ కెమెరాలలో లెన్స్‌లను పూర్తిగా మార్చుకునే సౌకర్యం (Fully replaceable lenses) కల్పించడం ఇదే మొదటిసారి. నీటిలో షూటింగ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. ఏకంగా 49 అడుగుల (15 మీటర్ల) లోతు వరకు ఇది వాటర్‌ప్రూఫ్.

గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆడియో స్పష్టంగా రికార్డ్ అవ్వడానికి ఇందులో బిల్ట్-ఇన్ విండ్ గార్డ్, కొత్త ఆడియో టెక్నాలజీ ఉన్నాయి. బ్యాటరీ కెపాసిటీని 2400mAhకు పెంచారు. దీనివల్ల 5.7K ఎండ్యూరెన్స్ మోడ్‌లో ఏకధాటిగా 185 నిమిషాల వరకు షూట్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 20 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.

* స్మార్ట్ ఫీచర్లు, క్రియేటివిటీకి హద్దుల్లేవ్..

ఇన్‌స్టాఫ్రేమ్ మోడ్
ఈ కొత్త ఫీచర్ చాలా బాగుంది. మీరు ఒకే సమయంలో సాధారణ ఫ్లాట్ వీడియో (Reframed flat video), 360° వీడియో రెండింటినీ షూట్ చేయొచ్చు. దీనివల్ల చిన్న క్లిప్స్ ను వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుని, తర్వాత పూర్తి 360° ఫుటేజ్‌ను వివరంగా ఎడిట్ చేసుకోవచ్చు.

* సూపర్ స్టెబిలిటీ, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్
ఫ్లోస్టేట్ స్టెబిలైజేషన్, 360° హారిజాన్ లాక్ ఫీచర్ల వల్ల మీరు ఎంత యాక్షన్ లో ఉన్నా, పరిగెత్తినా, దూకినా... వీడియో షేక్ అవ్వకుండా చాలా స్మూత్‌గా, స్థిరంగా ఉంటుంది. ఎప్పటిలాగే, సెల్ఫీ స్టిక్ కనిపించకుండా థర్డ్-పర్సన్ యాంగిల్‌లో వీడియోలు తీసే ఫీచర్ దీనిలో ఉంది.

మరిన్ని కంట్రోల్స్ చూస్తే షూటింగ్‌ను మరింత సులభంగా, వినూత్నంగా మార్చడానికి ట్విస్ట్ టు షూట్ (కెమెరాను తిప్పి షూట్ చేయడం), Gesture Control (చేతి సైగలతో కంట్రోల్), వాయిస్ కంట్రోల్ 2.0 (మాటలతో ఆదేశాలు), వైర్‌లెస్ రిమోట్ కనెక్షన్ వంటి కొత్త ఆప్షన్లు ఇచ్చారు.

* స్పెసిఫికేషన్లు, ధర వివరాలు
దీని బరువు 200 గ్రాములు, లెన్స్ f/2.0 అపెర్చర్, 6mm ఫోకల్ లెంగ్త్.. వీడియో రిజల్యూషన్లు 8K, 5.7K, 4K, 1080p.. ఫోటో రిజల్యూషన్ 72 మెగాపిక్సెల్ వరకు.. ఫార్మాట్ MP4 (షేరింగ్, ఎడిటింగ్ సులభం). ఏప్రిల్ 22న లాంచ్ అయిన ఈ కెమెరా ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉంది.

అమెజాన్ లేదా Insta360 అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనొచ్చు. అమెరికాలో దీని ధర USD 549.99 (సుమారుగా మన కరెన్సీలో రూ.46,890). భారతదేశంలో దీని అధికారిక ధర రూ.54,990. అదనపు యాక్సెసరీలతో కూడిన ఎసెన్షియల్స్ బండిల్ (Essentials Bundle) కూడా అందుబాటులో ఉంది, దీని ధర USD 659.99.

Best Mobiles in India

English summary
Insta360 X5 Launched: Powerful New 8K 360 AI Action Camera Sets New Standard
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X