8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్‌ విడుదల,కోర్ ఐ9 ప్రాసెసర్‌తో డెల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌‌లు

Written By:

ప్రపంచ వ్యాప్తంగా చిప్ తయారీ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఇంటెల్ తన 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను బీజింగ్‌లో జరిగిన తాజా ఈవెంట్‌లో విడుదల చేసింది.ఈ ఈవెంట్లో 8వ జనరేషన్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లను ఇంటెల్ ఆవిష్కరించింది. అలాగే ల్యాపీల కోసం ప్రత్యేకంగా 8వ జనరేషన్ కోర్ ఐ9 ప్రాసెసర్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఈ ప్రాసెసర్లను గేమింగ్, గ్రాఫిక్స్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఇంటెల్ వెల్లడించింది. ఇంటెల్ విడుదల చేసిన 8వ జనరేషన్ ప్రాసెసర్లను డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్ పీసీల్లో ఉపయోగించనున్నారు.

8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్‌ రెడీ ,కోర్ ఐ9తో డెల్ గేమింగ్ ల్యాపీలు

వీటి వల్ల ఆయా డివైస్‌లు మరింత వేగంగా పనిచేయడమే కాకుండా, ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో విడుదలైన ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్ల కన్నా ఈ ప్రాసెసర్లు 29 నుంచి 88 శాతం వరకు ఓవరాల్ ప్రదర్శనను ఎక్కువగా ఇస్తాయి. గ్రాఫిక్స్, డేటా కాపీయింగ్, ఇంటర్నెట్ స్పీడ్ తదితర అనేక అంశాల్లో గత ప్రాసెసర్ల కన్నా కొత్తగా వచ్చిన ఈ 8వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు మరింత వేగంగా పనిచేస్తాయి. కాగా ఈ ప్రాసెసర్ల ధర వివరాలను మాత్రం ఇంటెల్ ఇంకా వెల్లడించలేదు.

8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్‌ రెడీ ,కోర్ ఐ9తో డెల్ గేమింగ్ ల్యాపీలు

ఇక కంప్యూటర్స్ తయారీదారు డెల్ తన నూతన ఏలియన్‌వేర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 15, 17 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లలో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదల కాగా, వీటిల్లో కొత్తగా వచ్చిన ఇంటెల్ కోర్ ఐ9 ప్రాసెసర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గరిష్టంగా 5 గిగాహెడ్జ్ వరకు స్పీడ్ లభిస్తుంది.వీటితో పాటు జి సిరీస్‌లోనూ డెల్ పలు గేమింగ్ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. జీ3 15, 17, జీ5 15, జీ7 15 మోడల్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి.

Lenovo K8 Plus ధర రూ. 2000 తగ్గింది, బెస్ట్ ఫీచర్లు ఇవే

డెల్ ఏలియన్‌వేర్ ల్యాప్‌టాప్‌లలో 8 జీబీ గ్రాఫిక్స్ మెమొరీని అందిస్తుండగా జి సిరీస్ ల్యాప్‌టాప్‌లలో గరిష్టంగా 6 జీబీ గ్రాఫిక్స్ మెమొరీ లభిస్తున్నది. ఇక ఏలియన్ వేర్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.1.56 లక్షలు ఉండగా, జి సిరీస్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.48వేలగా ఉంది. కాగా ఈ నెల 10వ తేదీ నుంచి ఈ ల్యాప్‌టాప్ మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

English summary
Intel Launches 8th Gen Coffee Lake-H Family For High-Performance Notebooks – Core i9-8950HK Flagship With 6 Cores, 12 Threads and Up To 4.8 GHz Clocks at 45W
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot