రూ.3వేల ధరలో షాకిచ్చే ఫీచర్లతో itel బడ్జెట్ Smartwatchలు లాంచ్.

|

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ itel భారత మార్కెట్లో క్రమంగా తమ వస్తువుల్ని విస్తరింప చేస్తోంది. తాజాగా భారతీయ మార్కెట్‌లో తమ స్మార్ట్‌వాచ్ పోర్ట్‌ఫోలియోను పెంచడానికి itel రెండు కొత్త ఉత్పత్తులను ప్రకటించింది.

itel

తాజాగా విడుదలైన రెండు కొత్త మోడల్స్‌లో itel Smartwatch 2, మరొకటి itel Smartwatch 1GS ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ వాచ్లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లోనే ఉన్నాయి.

ఈ వాచ్ లలో అనేక గొప్ప ఫీచర్లు;

ఈ వాచ్ లలో అనేక గొప్ప ఫీచర్లు;

యూజర్లు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడానికి itel Smartwatch 2 అనేక స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తోంది. అంతేకాకుండా, ఇది 170+ వాచ్ ఫేస్‌లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ మరియు IP68 వాటర్ రెసిస్టెన్స్‌ కలిగి ఉంది. ఇందులో గొప్ప హెల్త్ ట్రాకింగ్ మరియు కాల్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇక itel Smartwatch 1GS విషయానికొస్తే.. సూపర్ స్టైలిష్ అల్లాయ్ ఫ్రేమ్ మరియు ఆకట్టుకునే రౌండ్ డయల్ కలిగి ఉంది. ఇన్ బిల్ట్ BT కాలింగ్ ఫీచర్‌ కలిగి ఉంది. ఇందులోనూ అనేక స్పోర్ట్స్ మోడ్, హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్‌లు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు వాచ్ ల ధరలు పూర్తి స్పెసిఫికేషన్ల గురించి మనం తెలుసుకుందాం.

భారత మార్కెట్లో రెండు స్మార్ట్ వాచ్ ల ధరలు;

భారత మార్కెట్లో రెండు స్మార్ట్ వాచ్ ల ధరలు;

భారత మార్కెట్లో Itel Smartwatch 1GS ధర కేవలం రూ.2,999 (దాదాపు 36 US డాలర్లు) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది, అయితే Smartwatch 2 మోడల్ రూ.2,499 (దాదాపు 30 US డాలర్లు)కి విక్రయించబడుతుంది అని కంపెనీ వెల్లడించింది.

itel Smartwatch 2 స్పెసిఫికేషన్లు;

itel Smartwatch 2 స్పెసిఫికేషన్లు;

itel Smartwatch 2 మోడల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 128MB స్టోరేజీ కెపాసిటీతో ఇన్ బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ తో వస్తోంది. తమకు ఇష్టమైన 40 పాటలను స్టోర్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా యూజర్లు అంతరాయం లేకుండా మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా, ఇది డ్యూయల్ కనెక్షన్‌ను కలిగి ఉంది, అంటే దీన్ని స్మార్ట్‌ఫోన్‌తో పాటు అదే సమయంలో TWS ఇయర్‌బడ్‌లను కనెక్ట్ చేయడానికి కూాడా అనుమతిస్తుంది. ఈ మోడల్ ఒకే బ్లాక్ వేరియంట్‌లో వస్తుంది.

itel Smartwatch 1GS  స్పెసిఫికేషన్లు;

itel Smartwatch 1GS స్పెసిఫికేషన్లు;

itel Smartwatch 1GS మోడల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. మరియు 1.32 అంగుళాల IPS LCD స్క్రీన్ తో సర్క్యులర్ ఆకారంలో చుట్టూ స్టైలిష్ మెటాలిక్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది ఇన్‌ఫ్రారెడ్ SpO2 బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌ను కూడా ప్యాక్ చేస్తుంది. మరియు స్లీప్ మానిటరింగ్ ఫీచర్ ను కూడా పర్యవేక్షించగలదు మరియు మీ హార్ట్ రెస్పాన్స్ రేటు 24*7ని ట్రాకింగ్ చేయగలదు.

ఈ డివైజ్ 250mAh బ్యాటరీ తో ప్యాక్ చేయబడింది. ఇంకా ఇది స్టాప్‌వాచ్, రిమోట్ కెమెరాతో వస్తుంది ఈ వాచ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

తాజాగా విడుదలైన రెండు మోడల్‌లు బ్లూటూత్ 5.1 మరియు IP68 వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంటాయి మరియు సెమీ అర్బన్ మరియు గ్రామీణ వినియోగదారుల కోసం తయారు చేయబడ్డాయి. రెండు స్మార్ట్‌వాచ్‌లు హౌసా మైక్ మరియు స్పీకర్‌లను కలిగి ఉంటాయి, ఇవి స్మార్ట్‌ఫోన్‌తో జత చేసినప్పుడు వినియోగదారులను వాటి నుండి నేరుగా కాల్‌లు చేయడానికి వీలు కల్పిస్తాయి.

Best Mobiles in India

English summary
Itel launched new itel Smartwatch 2, itel Smartwatch 1GS wearables in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X