జపాన్‌లో సందడి చేస్తోన్న ‘robot cafe’
సాధారణంగా మనం ఏదైనా కాఫీ షాప్‌కు వెళ్లామంటే అక్కడున్న వెయిటర్లు మనకు స్వాగతం పలకటంతో పాటు వేడివేడి కాఫీని సర్వ్ చేస్తుంటారు. తాజాగా జపాన్‌లో ఏర్పాటైన ఓ రోబోట్ కేఫ్ వినూత్న రీతిలో కాఫీని ఆఫర్ చేస్తోంది. హెన్నా కేఫ్ పేరుతో టోక్యో డౌన్‌టౌన్ బిజినెస్ ఏరియాలో ప్రారంభమైన ఈ కేఫ్‌లో ఓ రోబోట్ అతిథులకు మర్యాద చేస్తోంది.

ఈ కేఫ్ కౌంటర్‌లో కనిపిం చే Sawyer అనే మరో సింగిల్ హ్యాండెడ్ రోబోట్ కస్టమర్స్‌ను రిసీవ్ చేసుకోవటంతో పాటు వెండింగ్ మెచీన్ ద్వారా వారు కొనుగోలు చేసిన టికెట్‌ను స్కాన్ చేస్తుంది. అంతా ఓకే అయిన తరువాత కాఫీని కలిపి వారికి అందిస్తోంది. ఒకేసారి 5గురికి సరిపడా కాఫీని ఈ రోబోట్ తయారు చేస్తోంది. ఒక్కో కాఫీ ఖరీదు షుమారుగా 192 రూపాయులు.
ఈ రోబోట్ కాఫీతో పాటు కాపుచినో, హాట్ చాక్లెట్, గ్రీన్ టీ వంటి ఆరు ప్రత్యేకమైన హాట్ డ్రింక్స్ ను ఆఫర్ చేస్తోంది. Sawyer రోబోట్ మిక్స్ చేస్తున్న కాఫీ చాలా టేస్టీగా ఉండటంతో కస్టమర్స్ తాకిడి రోజురోజుకు పెరుగుతోందట. ఈ రోబోట్‌తో తీసుకన్న సెల్ఫీలు ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

రోబోట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన తమ ప్రొడక్టివిటీ మరింత పెరిగిందని, త్వరలోనే మరిన్న రోబోట్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతామని కేఫ్ నిర్వహణా బాధ్యతలను చూసుకుంటోన్న HIS ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది.


Click it and Unblock the Notifications