ప్రముఖ సంస్థ నుంచి ఇయర్‌బడ్స్ విడుదల.. టచ్‌స్క్రీన్‌తో ఛార్జింగ్ కేస్ సహా 40 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్..!!
ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ JBL భారత్ మార్కెట్ లో తన ఉత్పత్తులను క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ సంస్థ JBL లైవ్ భీమ్ 3 ఇయర్‌బడ్స్ ను (JBL Live Beam 3 Earbuds Launched) విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్ స్మార్ట్ ఛార్జింగ్ కేస్ తో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఛార్జింగ్ కేస్ 1.45 అంగుళాల టచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 40 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని JBL వెల్లడించింది.
JBL లైవ్ బీమ్ 3 ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్ లు :
JBL లైవ్ బీమ్ 3 ఇయర్‌బడ్స్ 10mm డ్రైవర్లను కలిగి ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ద్వారా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. స్మార్ట్ యాంబియంట్ సౌండ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. మరియు JBL స్పేషియల్ సౌండ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.

1.45 అంగుళాల టచ్ స్క్రీన్ :
ఈ ఇయర్‌బడ్స్ స్మార్ట్ ఛార్జింగ్ కేస్ ను కలిగి ఉంటాయి. ఈ ఛార్జింగ్ కేస్ 1.45 అంగుళాల టచ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. సెట్టింగ్స్ మార్చుకోవడం సహా వాల్యూమ్ నియంత్రించవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ మల్టీ పాయింట్ కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. మరియు IP55 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ (వాటర్ ఫ్రూఫ్) గా ఉన్నాయి.
ఛార్జింగ్ కేస్ ద్వారా 36 గంటల ప్లేబ్యాక్ టైం :
ఈ JBL లైవ్ బీమ్ 3 ఇయర్‌బడ్స్‌లో ఒక్కో బడ్ 68mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ఛార్జింగ్ ఛార్జింగ్ కేస్ 680mAh బ్యాటరీతో వస్తుంది. ANC ఆఫ్ చేసినప్పుడు 10 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

అదే ANC మరియు ట్రూ ANC ఆన్‌లో ఉన్నప్పుడు 9 గంటల ప్లే బ్యాక్ టైంను పొందవచ్చు. అదే ఛార్జింగ్ కేస్ ద్వారా 36 గంటలపాటు ప్లే బ్యాక్ టైంను పొందువచ్చు. పూర్తిగా ఛార్జింగ్ చేసేందుకు 2 గంటల సమయం పడుతుంది.
JBL లైవ్ బీమ్ 3 ధర, సేల్ వివరాలు :
JBL లైవ్ బీమ్ 3 ధర రూ.24,999 గా ఉంది. యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో ఇయర్‌బడ్స్ ధర రూ.13999 గా ఉంది. జూన్ 21 వరకు సేల్ ప్రారంభం అవుతుంది. JBL వెబ్‌సైట్ సహా ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లూ, సిల్వర్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications