Home
Gadgets

48 గంటల ప్లేబ్యాక్‌ టైం, సరికొత్త డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు!

ఇండియాలో ఆడియో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో అనేక సంస్థలు ఈ కేటగిరీపై దృష్టిసారిస్తున్నాయి. యూజర్ల సౌకర్యం, అవసరాలకు అనుగుణంగా ఇయర్‌బడ్స్‌, నెక్‌బ్యాండ్స్‌, TWS ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ JBL ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. ట్యూన్‌ సిరీస్‌ 2 (JBL Tune Series 2 Launched in india) పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొత్తం మూడు వేరియంట్స్‌ విడుదల :
ఈ JBL ట్యూన్ సిరీస్‌లో ట్యూన్ బడ్స్‌ 2, ట్యూన్‌ బీమ్‌ 2, ట్యూన్‌ ఫ్లెక్స్‌ 2 మోడల్స్‌ ఉన్నాయి. ఈ TWS ఇయర్‌బడ్స్‌ అనేక మెరుగైన ఫీచర్‌లు, బ్యాటరీ లైఫ్‌, ఆడియో క్వాలిటీని అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ TWS బడ్స్‌ అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

JBL Tune Series 2 launched with ANC and 48 hours of playback time in india

డిజైన్ వివరాలు :
ట్యూన్ బడ్స్‌ 2 ఇయర్‌బడ్స్‌ ఎర్గోనామిక్‌ బడ్‌ స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ బడ్స్ Closed Type స్టిక్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ట్యూన్‌ ఫ్లెక్స్‌ 2 బడ్స్‌ ఓపెన్‌ టైప్‌ స్టిక్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 12mm డ్రైవర్‌లతో లాంచ్ అయ్యాయి. ఫలితంగా మెరుగైన, ఆకట్టుకొనేలా ఆడియో అనుభూతిని అందిస్తాయని సంస్థ చెబుతోంది.

కస్టమ్‌ ఆడియో ప్రొఫైల్‌, గెశ్చర్ కంట్రోల్‌ :
ఈ జేబీఎల్‌ TWS ఇయర్‌బడ్స్‌ 6 మైక్రో ఫోన్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా ఆడియో నాణ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్స్‌ కస్టమ్‌ ఆడియో ప్రొఫైల్‌, గెశ్చర్ కంట్రోల్‌ కోసం Personi Fi 3.0 పెర్సనలైజేషన్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

నాయిస్‌ క్యాన్సిలేషన్‌ :
ఫీచర్‌ల పరంగా ఈ బడ్స్‌ అడాప్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), స్పేషియల్‌ సౌండ్‌, అప్‌గ్రేడెడ్‌ డ్రైవర్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మల్టీ పాయింట్ కనెక్షన్‌, గూగుల్ ఫాస్ట్‌ పెయిరింగ్‌ వంటి ఫీచర్‌ కూడా ఉన్నాయి. మరియు ఈ బడ్స్‌ TalkThru ఫీచర్‌ కూడా కలిగి ఉన్నాయి.

48 గంటల ప్లేబ్యాక్‌ టైం :
ఈ బడ్స్‌ను JBL హెడ్‌ఫోన్స్ యాప్‌ ద్వారా నియంత్రించవచ్చు. మరియు సెట్టింగ్స్‌లో మార్పులు చేయవచ్చు. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. JBL ట్యూన్‌ 2 సిరీస్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 48 గంటల ప్లేబ్యాక్‌ టైం ను పొందవచ్చు.

JBL ట్యూన్ సిరీస్‌ 2 ధర, సేల్‌ వివరాలు :
JBL ట్యూన్ సిరీస్‌ 2 ఏప్రిల్‌ 17 నుంచి భారత్‌ మార్కెట్‌లో సేల్‌ ప్రారంభం కానుంది. JBL అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రధాన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

ట్యూన్‌ బడ్స్ 2 ధర రూ.9,499 గా ఉంది. అదే ట్యూ్న్‌ ఫ్లెక్స్‌ 2 ధర రూ.10,499, ట్యూన్‌ బీమ్‌ 2 ధర రూ.11,999 గా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ బ్లాక్‌, వైట్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తాయి.

Best Mobiles in India

English summary
JBL Tune Series 2 launched with ANC and 48 hours of playback time in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X