Home
Gadgets

JioTagతో పోగొట్టుకున్న వస్తువుల లోకేషన్‌ను గుర్తించవచ్చు..!!

రిలయన్స్ జియో కొత్త ట్రాకింగ్‌ పరికరం JioTagను భారత్‌లో లాంచ్‌ చేసింది. జియోట్యాగ్‌తో ఎక్కడైనా పొరపాటున పెట్టిన వస్తువులను గుర్తించవచ్చని సంస్థ తెలిపింది. బ్లూటూత్‌ సాయంతో వస్తువులను ట్రాక్‌ చేయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో లభించే ట్రాకింగ్‌ డివైస్‌లతో ఇదే అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

అయితే భారత్‌లో ఇటువంటి ట్రాకింగ్ పరికరాలను ఆపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. AirTag పేరిట తీసుకొచ్చిన పరికరం ధర 3,490 రూపాయలకు కొనుగోలుచేయవచ్చు. అదే రూ.2,499 విలువైన జియో ట్రాకింగ్‌ పరికరాన్ని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కేవలం రూ.749లకు కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. అయితే కొన్ని పిన్‌కోడ్‌లలో మాత్రమే ప్రస్తుతానికి ఈ జియోట్యాగ్‌ పరికరం అందుబాటులో ఉందని తెలిపింది.

JioTag

జియోట్యాగ్‌ పరికరం ఫీచర్లు : జియోట్యాగ్‌ పరికరం సంవత్సరం పాటు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని జియో తెలిపింది. ట్రాకర్‌పై డబుల్‌ టాప్‌ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ సైలెంట్‌లో ఉన్న కూడా రింగ్‌ చేయించవచ్చని జియో తెలిపింది. వాలెట్‌, తాళాలు, ఇతర వస్తువుల లోకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఇంటిలోపల సుమారు 20 మీటర్లు, బయట ప్రాంతాల్లో 50 మీటర్ల వరకు జియోట్యాగ్‌ రేంజ్‌ ఉంటుందని, బ్లూటూత్‌ 5.1 కనెక్టివిటీతో పనిచేస్తుందని తెలిపింది.

ఈ JioTag కమ్యూనిటి ఫైండ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ట్రాకింగ్‌ పరికరం జియో ట్యాగ్‌ నుంచి డిస్‌కనెక్ట్‌ అయినా కూడా ఆ వస్తువు చివరగా ఉన్న లోకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చు. జియోట్యాగ్‌ పరికరం కూడా ఎక్కడైనా పెట్టి మరిచిపోయినా సరే దానిని కూడా ట్యాగ్‌ చేయవచ్చు. అందుకు కోసం JioThings యాప్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జియో కమ్యూనిటీ ఫైండ్‌ ఫీచర్‌ ద్వారా లోకేషన్‌ను తెలుసుకోవచ్చు.

జియోట్యాగ్‌ ట్రాకర్‌తోపాటు అదనపు బ్యాటరీ మరియు లాన్యార్డ్‌ కేబుల్‌ కూడా జియో అందిస్తుంది. దీంతో సులభంగా జియోట్యాగ్‌ ట్రాకర్‌ను ఇతర పరికరాలతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. అయితే జియోట్యాగ్‌ లిమిటెడ్‌ రేంజ్‌లో మాత్రమే పనిచేస్తుంది. పోగొట్టుకున్న వాలెట్‌, కారు తాళాలు మరియు లోకేషన్‌ను కొనుకొనవచ్చు. మరియు 20-50 మీటర్ల రేంజ్‌లో పొగొట్టుకున్న వస్తువులను మాత్రమే ఇది కనిపెట్టగలదు.

అదే ఎయిర్‌ట్యాగ్‌ మంచి ట్యాకింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా 30 అడుగుల కంటే ఎక్కువ దూరంలోని పరికరాల లోకేషన్‌ను కనుగొనవచ్చు. ఈ కనెక్షన్లు ఎండ్ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయని ఆపిల్‌ తెలిపింది. సంస్థ సహా ఇతరులు ఎవరూ ఎయిర్‌ట్యాగ్‌ వినియోగించి లోకేషన్‌ సహా ఇతర సమాచారం సేకరించరని స్పష్టం చేసింది.

ఎయిర్‌ట్యాగ్‌ జీపీఎస్‌ ట్రాకర్‌ కాదని గుర్తుంచుకోవాలని ఆపిల్‌ సూచించింది. ఐఫోన్లు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఈ ట్రాకింగ్‌ పరికరం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరికరం పెద్దగా ఉపయోగపడకవపోవచ్చు. ఎయిర్‌ట్యాగ్‌ ఆండ్రాయిడ్‌ను సపోర్టు చేయదు. మరియు ఎయిర్‌ట్యాగ్‌ నుంచి ఫోన్‌ అలెర్ట్ చేసే అవకాశం లేదు. మరియు తాళాలు సహా ఇతర వస్తువులను కనుగొనేందుకు ఎయిర్‌ట్యాగ్‌ ఉపయోగపడదు. మరియు ధర కొంచెం అధికంగా ఉంది.

Best Mobiles in India

English summary
jio launched tracking device called JioTag to find lost device
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X