జియోఫై మీద బంపరాఫర్, రూ. 3500 వరకు ప్రయోజనాలు..

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో వినియోగదారుల కోసం జియోఫై డివైస్ ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 10 నుంచి 15 డివైస్ లకు జియో నెట్ కనెక్ట్ అయ్యేలా కంపెనీ తీసుకువచ్చిన ఈ నెట్‌వర్క్‌లో డేటా స్పీడ్ కూడా అదే స్థాయిలో ఉంది. కాగా దీనిపై జియో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. జియోఫైను కొనుగోలు చేయాలని భావించే వారి కోసం ఈ సరికొత్త ఆఫర్‌ను ఆవిష్కరించింది. రూ.1999కి జియోఫై పరికరాన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు 3,595 రూపాయల వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు రిలయన్స్‌ జియో పేర్కొంది.

 

వాట్సప్‌లోకి కొత్త ఫీచర్ వచ్చేసిందివాట్సప్‌లోకి కొత్త ఫీచర్ వచ్చేసింది

 రూ.1999కి కొనుగోలు చేస్తే..

రూ.1999కి కొనుగోలు చేస్తే..

వినియోగదారులు దీన్ని రూ.1999కి కొనుగోలు చేస్తే జియో రూ.1,295కి డేటా రూపంలో కొనుగోలుదారులకు ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. రోజుకు 1.5జీబీ లేదా 2జీబీ లేదా 3జీబీ డేటా ప్లాన్లను ఈ సమయంలో కొనుగోలుదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

2,300 రూపాయల ఓచర్లను

2,300 రూపాయల ఓచర్లను

వీటితో పాటు ఈ డివైజ్‌తో పాటు 2,300 రూపాయల ఓచర్లను కస్టమర్లకు జియో అందించనుంది. ఈ ఓచర్లను పేటీఎం, ఏజియో, రిలయన్స్‌ డిజిటల్‌ షాపింగ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.3,595 ప్రయోజనాలు వినియోగదారులకు లభిస్తాయి.

రూ.999కి
 

రూ.999కి

పైన పేర్కొన ఆఫర్స్‌ మాత్రమే కాక జియోఫైను కంపెనీ రూ.999కు కూడా విక్రయిస్తోంది. అయితే రూ.999కి ఈ డివైజ్‌ను కొనుగోలు చేస్తే, ఎలాంటి డేటా ప్లాన్‌ ప్రయోజనాలను కానీ, షాపింగ్‌ ఓచర్లను కానీ వినియోగదారులు పొందరు.

4జీ ఫోన్‌ లేకపోయినా

4జీ ఫోన్‌ లేకపోయినా

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్‌ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని జియోఫై కల్పిస్తోంది. జేబులో పెట్టుకుని తీసుకెళ్లగలిగే ఈ బుల్లి పరికరం 2016 సెప్టెంబర్‌లో మార్కెట్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది.

3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో,

3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో,

జియోఫైతో వినియోగదారులు 3జీ లేదా 2జీ స్మార్ట్‌ఫోన్లలో, లాప్‌టాప్‌లలో జియో అద్భుతమైన సేవలను పొందవచ్చు. దీంతో కుటుంబసభ్యులు లేదా చిన్న సంస్థలోని సిబ్బందిని జియో డిజిటల్‌ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు.

10 నుంచి 32 పరికరాలను

10 నుంచి 32 పరికరాలను

10 నుంచి 32 పరికరాలను జియోఫైతో అనుసంధానించవచ్చు. 2,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ డివైజ్‌, ఆరు గంటల పాటు పనిచేయనుంది. జియో4జీవాయిస్‌ యాప్‌ ద్వారా హెచ్‌డీ వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌, మెసేజింగ్‌ వంటి వాటికి ఇది సపోర్టు చేయనుంది.

Best Mobiles in India

English summary
JioFi new offer Free Recharge and More Benefits up to Rs 2595 More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X