Kodak Android TVs : Mi టీవీల కంటే తక్కువ ధరకే... ఫీచర్స్ బ్రహ్మాండం...

|

సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) యొక్క లైసెన్సు గల కోడాక్ సంస్థ ఇప్పుడు ఇండియాలో నాలుగు సరి కొత్త ఆండ్రాయిడ్ టివిలను విడుదల చేసింది. కోడాక్ CA సిరీస్‌లో భాగమైన కొత్త ఆండ్రాయిడ్ టివిలు 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో వస్తాయి.

కోడాక్ సిఎ ఆండ్రాయిడ్ టివి

కోడాక్ సిఎ ఆండ్రాయిడ్ టివి

కొడాక్ సంస్థ ఈ నాలుగు స్మార్ట్ టీవీలకు కొన్ని ఆకట్టుకునే ఫీచర్లను జోడించడమే కాకుండా వీటిని తక్కువ ధర వద్ద కేవలం 23,999 రూపాయల నుండి అమ్మకానికి ఉంచింది. కోడాక్ ఎల్లప్పుడూ షియోమి యొక్క Mi టివి సిరీస్ లను ధరల పరంగా ఓడించగలిగింది మరియు సరికొత్త కోడాక్ సిఎ ఆండ్రాయిడ్ టివిలతో సమానంగా ఉంటుంది. షియోమి 43 అంగుళాల 4K స్మార్ట్ టివిని భారతదేశంలో రూ .24,999 కు విక్రయిస్తుండగా కోడాక్ సంస్థ తన 43 అంగుళాల స్మార్ట్ టివిని 23,999 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. కోడాక్ CA టివిలను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

 

Redmi Note 9 Pro సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...Redmi Note 9 Pro సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...

కోడాక్ CA ఆండ్రాయిడ్ టివిల స్పెసిఫికేషన్స్

కోడాక్ CA ఆండ్రాయిడ్ టివిల స్పెసిఫికేషన్స్

కోడాక్ యొక్క కొత్త టీవీలు ‘మేక్ ఇన్ ఇండియా' చొరవతో లాంచ్ అయ్యాయి. ఇది గూగుల్‌తో కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఒక పత్రిక ప్రకటనలో కోడాక్ తెలిపింది. కొత్త కోడాక్ సంస్థ యొక్క కొత్త CA సిరీస్ టీవీలు నాలుగు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో వస్తాయి- 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు మరియు 65-అంగుళాలు. నాలుగు టీవీలు ఒకే UHD 4K రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. ఈ నాలుగు టీవీలు హెచ్‌డిఆర్ 10 మరియు HDR10 + కి కూడా మద్దతును ఇస్తున్నాయి.

ఫీచర్స్

ఫీచర్స్

కోడాక్ CA ఆండ్రాయిడ్ కొత్త టీవీలలో డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్ ప్లస్, డిటిఎస్ ట్రూసర్రౌండ్, ఎయిర్‌ప్లే, క్రోమ్‌కాస్ట్, MEMC వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని యొక్క డిస్ప్లేలు 500000: 1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తున్నాయి. నాలుగు టీవీల్లోని కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్ట్‌లు మరియు రెండు యుఎస్‌బి 3.0 పోర్ట్‌లు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే ఈ కొత్త టీవీలు ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీ 9 పై మీద రన్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ టీవీ 10 యొక్క అప్ డేట్ ను పొందవచ్చు.

ఆండ్రాయిడ్ కనెక్టివిటీ

ఆండ్రాయిడ్ కనెక్టివిటీ

కోడాక్ CA సిరీస్ స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ కనెక్టివిటీతో రన్ అవుతున్నాయి కాబట్టి ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, Zee5, హాట్‌స్టార్ మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి అన్ని ప్రముఖ యాప్ లు ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. దీనికి గల వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్, యూట్యూబ్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల హాట్ కీలను కూడా అందిస్తుంది. హార్డ్‌వేర్ విషయానికొస్తే ఈ టీవీలు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 1.75GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటాయి.

ధరల వివరాలు

ధరల వివరాలు

కోడాక్ సంస్థ ఇండియాలో మొత్తం నాలుగు కొత్త ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఇందులో 43 అంగుళాల స్క్రీన్‌తో గల మొదటి టీవీ యొక్క ధర 23,999 రూపాయలు, 50 అంగుళాల మోడల్ యొక్క ధర 27,999 రూపాయలు. 55 అంగుళాల మోడల్ యొక్క ధర రూ.30,999 కాగా చివరిది 65 అంగుళాల స్మార్ట్ టీవీ యొక్క ధర రూ.49,999. ఈ నాలుగు టీవీలకు పోటీగా 43-అంగుళాల 4K యుహెచ్‌డి షియోమి Mi టివి ప్రస్తుతం రూ.24,999 వద్ద లభిస్తుంది. అలాగే 50 అంగుళాల మోడల్ రూ.29,999 ధర వద్ద మరియు 50-అంగుళాల 4K మోడల్ రూ.35,000 ధర వద్ద లభిస్తుంది. చివరిగా 65-అంగుళాల Mi టివిని రూ.54,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Kodak Launches new Android Smart TVs at Rs 23,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X