స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్‌లోకి మరో సంస్థ.. AI ఫీచర్లతో ఏప్రిల్ 23న తొలి వాచ్ విడుదల.. ధర ఎంతంటే??
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ విషయాన్ని సంస్థ ధ్రువీకరించింది. భారత్‌లో ఏప్రిల్ 23 న స్మార్ట్ వాచ్ ProWatch ను (Lava Smartwatch) లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్ వాచ్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ సునిల్ రైనా తెలిపారు. మరికొన్ని నెలల్లో అనేక మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తమ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే స్మార్ట్‌వాచ్‌లలోనూ ఆసక్తికర ఫీచర్లను అందిస్తామన్నారు. గత ఆగస్టులోనే ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిపారు.

వినియోగదారులకు ఏం కావాలో మాకు తెలుసు :
ఈ లావా స్మార్ట్ వాచ్‌లను భారత్‌లోనే తయారు చేస్తామన్నారు సునిల్ రైనా. గత 14 సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ఇక స్మార్ట్ వాచ్‌ల విషయానికి వస్తే.. వినియోగదారులకు ఏం కావాలో తమకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు.
రూ.4000 కంటే తక్కువ ధరకే..!!
ఇప్పటికే వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా లావా ప్రోవాచ్ (Lava ProWatch) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు ఈ వాచ్ ధర రూ.4000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లను విక్రయిస్తున్న బోట్, ఫైర్ బోల్ట్ మరియు నాయిస్ సహా అనేక సంస్థలకు లావా ప్రోవాచ్ పోటీనిచ్చే అవకాశం ఉంది.
** లావా సంస్థ భారత్‌లో ఇటీవల లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. ఈ చిప్ 8GB LPDDR5 ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది.
లావా బ్రేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాలను కలిగి ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








