Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా.. ప్రోవాచ్ సిరీస్ (Lava Prowatch) ద్వారా స్మార్ట్ వాచ్‌ల సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా రెండు వాచ్‌లను విడుదల చేయనుంది. ప్రో వాచ్ ZN మరియు ప్రో వాచ్ VN మోడళ్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ల గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ఏప్రిల్ 23న విడుదల :
లావా సంస్థ ఈ రెండు స్మార్ట్ వాచ్‌లను ఏప్రిల్ 23 న విడుదల (Lava SmartWatch Launch) చేయనుంది. VN ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ప్రోవాచ్ VN 1.96 అంగుళాల TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 232mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

బేస్ వేరియంట్ ధర రూ.3000 కంటే తక్కువే! :
ఈ వాచ్ రూ.3000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుందని లావా సంస్థ తెలిపింది. తాజాగా లావా స్మార్ట్ వాచ్ వీడియో బయటకు వచ్చింది. డిజైన్ పరంగా స్క్వేర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మరియు వాచ్ కుడివైపున క్రోన్‌ను కలిగి ఉంది. ఈ లావా ప్రోవాచ్ VN బ్లూటూత్ సపోర్టును కలిగి ఉంటుంది.
అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరెల్లా గ్లాస్ సపోర్టుతో :
ప్రోవాచ్ ZN స్మార్ట్‌వాచ్ వేరియంట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రక్షణ కోసం గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది. ఈ వాచ్ వృత్తాకార స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. క్రోన్ సహా ఫంక్షన్ బటన్‌తో వస్తుంది. దీని ద్వారా ఒత్తిడి, బ్లడ్ ప్రజర్, హార్ట్ రేట్‌ను పర్యవేక్షించవచ్చు. ఈ వాచ్ ధర సుమారుగా రూ.6000 గా ఉంటుందని తెలుస్తోంది.
గతంలో సంస్థ ఏం చెప్పిందంటే :
ఏప్రిల్ 9న ఈ వాచ్ వివరాలు వెల్లడించిన సందర్భంగా లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ సునిల్ రైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే స్మార్ట్ వాచ్‌లలోనూ ఆసక్తికర ఫీచర్లను అందిస్తామన్నారు. ఈ లావా ప్రో వాచ్ స్మార్ట్ వాచ్‌లను భారత్‌లోనే తయారు చేస్తామన్నారు.
గత 14 సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. ఇక స్మార్ట్ వాచ్‌ల విషయానికి వస్తే.. వినియోగదారులకు ఏం కావాలో తమకు స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఈ స్మార్ట్‌వాచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అయితే దీనిపై లావా సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Source : JagranEnglish


Click it and Unblock the Notifications








