Home
Gadgets

Lava ProWatch లావా ప్రోవాచ్‌ సేల్‌ ప్రారంభం అయింది... ప్రారంభ ఆఫర్‌ కింద భారీ తగ్గింపు!

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా రెండు రోజుల రెండు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ ప్రో వాచ్‌ VN మరియు Zn స్మార్ట్‌వాచ్‌లు సేల్‌ ఇవాళ్టి నుంచి (Lava ProWatch sale) ప్రారంభం అయింది. లావా అధికారిక వెబ్‌సైట్‌ సహా అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్‌ వాచ్‌లను కొనుగోలు చేస్తే 24 నెలలపాటు వారంటీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 700 లావా సర్వీస్‌ సెంటర్ల ద్వారా సర్వీసింగ్ చేయించుకోవచ్చు. ప్రో వాచ్‌ Vn బేస్‌ వేరియంట్‌గా ఉంది. అదే ప్రోవాచ్‌ Zn హైఎండ్‌ మోడల్‌గా ఉంది.

Lava ProWatch Vn and Zn variants sale is live

Vn వేరియంట్‌ సాధారణ ధర రూ.3999 కాగా ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.1999 కే అందిస్తోంది. లావా ప్రోవాచ్ Zn స్మార్ట్‌వాచ్‌ సాధారణ ధర రూ.5,999 గా ఉంది. సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.2599, మెటాలిక్‌ స్ట్రాప్‌ వేరియంట్‌ ధర రూ.2,999 గా ఉంది.

లావా ప్రోవాచ్‌ Vn స్పెసిఫికేషన్లు :
లావా ప్రోవాచ్‌ Vn స్మార్ట్‌వాచ్‌ 320*386 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.96 అంగుళాల TFT 2.5D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఫలితంగా ఎక్కువ వెలుగులోకి సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. నావిగేషన్ కోసం స్క్రోల్‌ బటన్‌ మరియు వాయిస్‌ అసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది.

ఈ Vn వేరియంట్‌ స్మార్ట్‌వాచ్‌ 150కి పైగా వాచ్‌ ఫేస్‌లు, 115 కి పైగా ఇన్‌బిల్ట్‌ స్పోర్ట్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఫిట్‌నెట్‌ ట్రాకింగ్‌ కోసం పనిచేస్తాయి. హార్ట్‌ మానిటరింగ్‌, SPO2 ట్రాకర్‌, ఒత్తిడి, స్లీప్‌ ట్రాకర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ IP67 రేటింగ్‌తో వాటర్‌ మరియు డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉన్నాయి.

లావా ప్రో వాచ్‌ Vn స్మార్ట్‌ వాచ్‌ మెటాలిక్‌ జింక్‌ బాడీ మరియు సౌకర్యవంతమైన సిలికాన్‌ స్ట్రాప్‌ తో లాంచ్‌ అయింది. Realtek చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. డెల్ఫ్ట బ్లూ, మూర్‌ బ్లూక్‌, గుల్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్లు :
లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. డిస్‌ప్లే కార్నింగ్‌ గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రాప్‌ మరియు మెటాలిక్‌ డయల్ ను కలిగి ఉంటుంది. నావిగేషన్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ బటన్‌ ను కలిగి ఉంది. RTL8763EWE - వీపీ చిప్‌. ఈ డిస్‌ప్లే Always On Mode ఫీచర్‌ ను పొందుతుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ కోసం VC9202 + VP60A PPG సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లడ్‌ ఆక్సిజన్‌ను ట్రాకింగ్‌ చేయనుంది. దీంతోపాటు ఒత్తిడి, శ్వాస, స్లీప్‌ మానిటర్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 150 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 110 స్పోర్ట్స్‌ మోడళ్లను కలిగి ఉంది.

ఈ లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ 5.2 వెర్షన్‌ తో బ్లూటూత్‌ కాలింగ్‌ సపోర్టును పొందుతుంది. వాయిస్‌ కాల్స్‌ ను వాచ్‌ నుంచే మాట్లాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ వాచ్‌ IP68 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. ఆండ్రాయిడ్‌ లేదా iOS స్మార్ట్‌ఫోన్లతో జతచేయవచ్చు. దీంతోపాటు మరియు 2048, రేసింగ్‌, జిగ్‌స పజిల్‌ వంటి ఇన్‌ బిల్ట్‌ గేమ్‌లను కలిగి ఉంటుంది.

ఈ లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ 350mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సాధారణ వినియోగంతో 8 రోజలపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు 20 రోజులపాటు స్టాండ్‌బై టైంను కలిగి ఉంటుందని తెలిపింది. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను వినియోగంతో మూడు రోజులపాటు వినియోగించవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి ఛార్జింగ్‌కు గంట సమయం పడుతుందని లావా వెల్లడించింది. బ్లాక్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Lava ProWatch Vn and Zn variants sale is live on amazon and lava stores
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X