10 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్‌లు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌తో స్మార్ట్‌వాచ్.. రూ.1000 డిస్కౌంట్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ లావా భారత్ మార్కెట్ లో ఇవాళ స్మార్ట్‌వాచ్ ను లాంచ్ చేసింది. లావా ప్రో వాచ్ X పేరుతో (Lava Prowatch X Smartwatch) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ మెరుగైన డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. GPS, బ్లూటూత్ కాలింగ్ సహా అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ లావా స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
లావా ప్రోవాచ్ X స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 30Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 326ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది.

బిల్ట్-ఇన్ GPS ఫీచర్ :
ఈ లావా వాచ్ డ్యూయల్ కోర్ ATD3085C ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మరియు 110 వాచ్ ఫేసెస్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ వాచ్ బిల్ట్ ఇన్ GPS, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఫలితంగా బ్లూటూత్ కాలింగ్ ను సపోర్టు చేస్తుంది.
హార్ట్ రేట్ మానిటరింగ్ :
ఈ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ట్రాకర్‌లను కలిగి ఉంది. ఇందుకోసం అనేక సెన్సార్‌లను వినియోగించారు. హార్ట్ రేట్ మరియు SpO2 స్థాయిని తెలుసుకొనేందుకు Hx3960 PPG సెన్సార్‌ను ఉపయోగించారు. వీటితోపాటు కంపాస్, ఆల్టీమీటర్, బారోమీటర్, యాక్సెలిరోమీటర్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ :
వీటితోపాటు బాడీ ఎనర్జీ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, HRV, VO2 మ్యాక్స్, బ్రీటింగ్ సహా అనేక ట్రాకర్‌లను కలిగి ఉంది. ఇవే కాకుండా మరిన్ని అనేక ప్రత్యేక ఫీచర్‌లను అమర్చినట్లు లావా చెబుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరియు స్మార్ట్‌ఫోన్ ట్రాకింగ్ వంటి ఫీచర్‌లను కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్టు చేస్తుందని తెలిపింది.
ఈ వాచ్ 110 స్పోర్ట్స్ మరియు వర్కౌట్‌లను గుర్తించేలా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఇంటెలిజెంట్ Exercise recognition, ఏరోబిక్ ట్రైనింగ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, iOS స్మార్ట్‌ఫోన్‌లను సపోర్టు చేస్తుందని లావా వెల్లడించింది.
10 రోజుల బ్యాటరీ లైఫ్ :
లావా ప్రోవాచ్ X స్మార్ట్‌వాచ్ 300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 10 రోజులపాటు వినియోగించుకోవచ్చు. లేదా GPS ఆన్‌లో ఉన్నప్పుడు 17 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. లేదా 5 గంటలపాటు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
లావా ప్రోవాచ్ X ధర, సేల్ వివరాలు :
భారత్ మార్కెట్‌లో లావా ప్రోవాచ్ X ధర రూ.4499 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ వాచ్‌ను ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ముందస్తు బుకింగ్ చేసిన వారికి అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినా.. రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చని లావా వెల్లడించింది.
కలర్ వేరియంట్ :
లావా స్మార్ట్‌వాచ్‌ను ఫిబ్రవరి 21 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ వాచ్ మెటల్, నైలాన్, సిలికాన్ స్ట్రాప్ వేరియంట్స్‌లో లభిస్తుంది. దీంతోపాటు కాస్మిక్ గ్రే రంగులో మాత్రమే భారత్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications