Home
Gadgets

స్మార్ట్‌వాచ్‌ సెగ్మెంట్‌లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్‌, హెల్త్‌ ట్రాకర్లతో ProWatch విడుదల..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా తాజాగా స్మార్ట్‌వాచ్‌ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఇవాళ తన తొలి స్మార్ట్‌వాచ్‌ను లావా ప్రోవాచ్‌ Zn, Vn (Lava ProWatch SmartWatch) భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ Zn వేరియంట్‌ అమోలెడ్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గెరెల్లా గ్లాస్‌ రక్షణ సహా IP68 రేటింగ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది.

లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్లు :
లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. డిస్‌ప్లే కార్నింగ్‌ గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

Lava Prowatch ZN and Vn smartwatchs launched in india specs

ఈ స్మార్ట్‌వాచ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రాప్‌ మరియు మెటాలిక్‌ డయల్ ను కలిగి ఉంటుంది. నావిగేషన్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ బటన్‌ ను కలిగి ఉంది. RTL8763EWE - VP చిప్‌. ఈ డిస్‌ప్లే Always On Mode ఫీచర్‌ ను పొందుతుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంటుంది. హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ కోసం VC9202 + VP60A PPG సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లడ్‌ ఆక్సిజన్‌ను ట్రాకింగ్‌ చేయనుంది. దీంతోపాటు ఒత్తిడి, శ్వాస, స్లీప్‌ మానిటర్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 150 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 110 స్పోర్ట్స్‌ మోడళ్లను కలిగి ఉంది.

Lava Prowatch ZN and Vn smartwatchs launched in india specs

ఈ లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ 5.2 వెర్షన్‌ తో బ్లూటూత్‌ కాలింగ్‌ సపోర్టును పొందుతుంది. వాయిస్‌ కాల్స్‌ ను వాచ్‌ నుంచే మాట్లాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ వాచ్‌ IP68 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. ఆండ్రాయిడ్‌ లేదా iOS స్మార్ట్‌ఫోన్లతో జతచేయవచ్చు. దీంతోపాటు మరియు 2048, రేసింగ్‌, జిగ్‌స పజిల్‌ వంటి ఇన్‌ బిల్ట్‌ గేమ్‌లను కలిగి ఉంటుంది.

ఈ లావా ప్రోవాచ్‌ Zn స్మార్ట్‌వాచ్‌ 350mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సాధారణ వినియోగంతో 8 రోజలపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు 20 రోజులపాటు స్టాండ్‌బై టైంను కలిగి ఉంటుందని తెలిపింది. బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను వినియోగంతో మూడు రోజులపాటు వినియోగించవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి ఛార్జింగ్‌కు గంట సమయం పడుతుందని లావా వెల్లడించింది.

Lava Prowatch ZN and Vn smartwatchs launched in india specs

లావా ప్రోవాచ్‌ Zn ధర..
లావా ప్రోవాచ్ Zn.. సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.2599 గా ఉంది. అదే మెటాలిక్‌ స్ట్రాప్‌ వేరియంట్‌ ధర రూ.2,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఈ తక్కువ ధరకే అందిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ సేల్‌ ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. లావా అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ సహా రిటైల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌, గ్రే రంగుల్లో లభిస్తుంది.

లావా ప్రోవాచ్‌ Vn స్పెసిఫికేషన్లు :
లావా ప్రోవాచ్‌ Vn స్మార్ట్‌వాచ్‌ 320*386 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 1.96 అంగుళాల TFT 2.5D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. ఫలితంగా ఎక్కువ వెలుగులోకి సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. నావిగేషన్ కోసం స్క్రోల్‌ బటన్‌ మరియు వాయిస్‌ అసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది.

ఈ Vn వేరియంట్‌ స్మార్ట్‌వాచ్‌ 150కి పైగా వాచ్‌ ఫేస్‌లు, 115 కి పైగా ఇన్‌బిల్ట్‌ స్పోర్ట్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇవి ఫిట్‌నెట్‌ ట్రాకింగ్‌ కోసం పనిచేస్తాయి. హార్ట్‌ మానిటరింగ్‌, SPO2 ట్రాకర్‌, ఒత్తిడి, స్లీప్‌ ట్రాకర్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ IP67 రేటింగ్‌తో వాటర్‌ మరియు డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉన్నాయి.

లావా ప్రోవాచ్‌ Vn స్మార్ట్‌వాచ్‌ మెటాలిక్‌ జింక్‌ బాడీ మరియు సౌకర్యవంతమైన సిలికాన్‌ స్ట్రాప్‌ తో లాంచ్‌ అయింది. Realtek చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. డెల్ఫ్ట బ్లూ, మూర్‌ బ్లూక్‌, గుల్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌ సాధారణ ధర రూ.3999 కాగా ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.1999 కే అందిస్తోంది. ఏప్రిల్‌ 26 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Prowatch ZN and Vn smartwatchs launched in india with health trackers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X