Lenovo M2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర & ఫీచర్స్ పూర్తి వివరాలు ఇవే....

|

ప్రముఖ లెనోవా సంస్థ కొత్తగా లెనోవా M 2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చైనాలో ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం రెండు కలర్ ఆప్షన్లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచింది. ఈ లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ 12 కిలోల బరువు ఉండి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

 

ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్ ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుందని లెనోవా పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వాడకం భారతదేశంలో చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చైనాలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని సంవత్సరాలుగా షియోమితో సహా మిగిలిన బ్రాండ్లు తమ దేశంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేశాయి.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

లెనోవా వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్ అండ్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్స్ ల‌లో లభిస్తుంది. ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ధర CNY1,999. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని యొక్క విలువ సుమారు రూ.21,360 గా నిర్ణయించబడింది. లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం సంస్థ తన వెబ్‌సైట్‌లో వీటిని ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ చైనాలో అందుబాటులో ఉంది. లెనోవా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

 

 

Tata Sky Offers: రెండు నెలల సేవలను ఉచితంగా పొందే గొప్ప అవకాశం...Tata Sky Offers: రెండు నెలల సేవలను ఉచితంగా పొందే గొప్ప అవకాశం...

లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

లెనోవా M 2 ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అలాగే ఇది దాని ఒక ఛార్జీపై 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది తక్కువ దూర ప్రయాణానికి అనువుగా ఉంటుంది మరియు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలతో బాధపడవలసిన అవసరం ఉండదు.

 

 

 

OnePlus 8 series: గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మొదలైన ప్రీ-బుకింగ్స్....OnePlus 8 series: గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మొదలైన ప్రీ-బుకింగ్స్....

లెనోవా M 2 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ

లెనోవా M 2 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ

లెనోవా M 2 ఎలక్ట్రిక్ స్కూటర్ 350W వరకు శక్తిని ఉత్పత్తి చేయగల లిథియం బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని యొక్క బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. అలాగే వినియోగదారులు WeChat యాప్ ద్వారా బ్యాటరీ యొక్క స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు.

 

 

 

సరసమైన ధరలో ఉత్తమమైన పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ & పెన్‌డ్రైవ్ లుసరసమైన ధరలో ఉత్తమమైన పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ & పెన్‌డ్రైవ్ లు

ఎలక్ట్రిక్ స్కూటర్  బ్రేక్ సిస్టమ్

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్ సిస్టమ్

లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ ట్రిపుల్ షాక్ అబ్సర్ప్షన్ వ్యవస్థతో పాటు ట్రిపుల్ బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. బ్రేక్ సిస్టమ్‌లో సబ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ మరియు ఫుట్ బ్రేక్ వంటివి ఉన్నాయి. కాగా షాక్ అబ్సర్ప్షన్ వ్యవస్థలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, హిడెన్ షాక్ అబ్జార్బర్ మరియు టైర్ డంపర్ వంటివి ఉన్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ బాడీ ప్యానెల్

ఎలక్ట్రిక్ స్కూటర్ బాడీ ప్యానెల్

లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ లో LED కంట్రోల్ పానెల్ ను అమర్చారు. ఇది ప్రస్తుత వేగం, శక్తి, గేర్ మరియు ఇతర స్థితులను డిస్ప్లే చేస్తుంది. లెనోవా M2 స్కూటర్ యొక్క బాడీ అల్యూమినియం మిశ్రమంతో నిర్మించబడి ఉండడమే కాకుండా IP54 రక్షణ కోసం కూడా రేట్ చేయబడింది. చివరగా లెనోవా M2 ఎలక్ట్రిక్ స్కూటర్ 15 కిలోల బరువును కలిగి ఉండి పూర్తిగా ఓపెన్ చేసి ఉన్నప్పుడు 1110x1110x520mm పరిమాణంలో ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మడతపెట్టే స్థితిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు ఇది 1100x400x700 మిమీ పరిమాణంతో వస్తుంది.

Best Mobiles in India

English summary
Lenovo M2 Electric Scooter Launched : Price and Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X