Home
Gadgets

Lenovo మొదటి 5G ఫీచర్ టాబ్లెట్!! ఫీచర్స్, లాంచ్ డేట్ వివరాలు ఇవిగో...

చైనా యొక్క టెక్నాలజీ సంస్థ లెనోవా స్మార్ట్ ఫోన్ లతో పాటుగా అనేక విభాగాలలో కూడా సత్తా చాటుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ రెండు కొత్త టాబ్లెట్లను విడుదల చేయనున్నది. యోగా ప్యాడ్ ప్రో మరియు జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ పేరుతో రాబోయే ఈ రెండు కొత్త టాబ్లెట్లను త్వరలోనే విడుదల చేయనుంది. లెనోవా యొక్క ఈ రెండు టాబ్లెట్‌ల గురించి కొంత సమాచారాన్ని కొన్ని లీక్‌లు ఇప్పటికే వెల్లడించాయి. యోగా ప్యాడ్ ప్రో మరియు జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

లెనోవా యోగా ప్యాడ్ ప్రో యొక్క ఆశించదగ్గ ఫీచర్స్

లెనోవా యోగా ప్యాడ్ ప్రో యొక్క ఆశించదగ్గ ఫీచర్స్

లెనోవా యోగా ప్యాడ్ ప్రో టాబ్లెట్‌ 13 అంగుళాల 2K డిస్‌ప్లేను 2,160 × 1,350 పిక్సెల్స్ పరిమాణంలో పంచ్-హోల్ డిజైన్ లేకుండా కలిగి ఉంటుంది అని డిజిటల్ చాట్ స్టేషన్ ఇటీవల వెల్లడించింది. ఈ టాబ్లెట్ ఆకట్టుకునే స్పీకర్లను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC చేత శక్తినిపొందుతుంది.


కొత్తగా వచ్చిన లీక్ ప్రకారం లెనోవా యోగా ప్యాడ్ ప్రో టాబ్లెట్‌ మోడల్ నంబర్ YT-K606F ను కలిగి ఉంటుంది. ఇది లెనోవా వన్ మద్దతుతో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ZUI 12.5 పై రన్ అవుతుంది. అంతేకాకుండా రాబోయే ట్యాబ్ ప్రపంచ మార్కెట్లలో లెనోవా యోగా టాబ్ 13 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.

లెనోవా జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ యొక్క ఆశించదగ్గ ఫీచర్స్

లెనోవా జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ యొక్క ఆశించదగ్గ ఫీచర్స్

లెనోవా విడుదల చేయనున్న మరొక టాబ్లెట్‌ లెనోవా జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ 5G ఫీచర్లతో విడుదల చేయనున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ ఆవిష్కరించింది. లెనోవా నుంచి 5G ఫీచర్లతో రాబోతున్న మొదటి టాబ్లెట్ ఇదే కావడం విశేషం. ఈ టాబ్లెట్ 11-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 SoC చేత శక్తిని ఇవ్వగలదని భావిస్తున్నారు. అయితే టాబ్లెట్ మోడల్ నంబర్ TB-J607Z‌ వై-ఫై-మాత్రమే వెర్షన్‌తో విడుదల చేయబడుతుందని కంపెనీ ధృవీకరించింది. మునుపటి నివేదికలు లెనోవా జియాక్సిన్ ప్యాడ్ ప్లస్ ఆండ్రాయిడ్ 11 లో నడుస్తుందని మరియు ప్రపంచవ్యాప్తంగా లెనోవా టాబ్ P11 సిరీస్ టాబ్లెట్‌గా విడుదల చేయబడుతుందని పేర్కొంది.

 

లెనోవా యోగా డ్యూట్ 2021

లెనోవా యోగా డ్యూట్ 2021

ఈ రెండు టాబ్లెట్‌లతో పాటు విండోస్-పవర్డ్ 2-ఇన్ -1 లెనోవా యోగా డ్యూట్ 2021 ను కూడా లెనోవా విడుదల చేయనున్నది. యోగా సిరీస్ యొక్క ముందు వెర్షన్స్ ఇంతకు ముందు మంచి విజయాన్ని సాధించాయి. దాని యొక్క కొత్త వెర్షన్‌ను మరింత మెరుగైన ఫీచర్లతో విడుదల చేయడంలో కంపెనీ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నది. 2-ఇన్ -1 లెనోవా యోగా డ్యూట్ 2021 టాబ్లెట్ రూపకల్పనతో ల్యాప్‌టాప్ పనితీరు అవసరమయ్యే వినియోగదారులకు ఖచ్చితంగా సరిపోతుంది.

లెనోవా

లెనోవా సంస్థ నుంచి రాబోయే ఏ కొత్త పరికరాల యొక్క ధర గురించి ఖచ్చితమైన సమాచారం ఇంకా వెల్లడించలేదు. కావున దాని యొక్క ధర గురించి సరైన సమాధానం తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచి ఉండాలి. లెనోవా నుండి రాబోయే ఈ మూడు పోర్టబుల్ పరికరాలు మార్కెట్లో ఎటువంటి మార్పులను తీసుకురానున్నాయో మరియు కస్టమర్లు వాటిని ఎంత బాగా ఇష్టపడతారో చూడాలి.

Best Mobiles in India

English summary
Lenovo's First 5G Feature Tablet!! Features, Specs, Launch Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X