లెనోవా మొట్టమొదటి ఫోల్డబుల్ PC!!! ధర కొంచెం భారీగానే.....

|

గత ఏడాది మేలో లెనోవా సంస్థ తన థింక్‌ప్యాడ్ ఎక్స్ 1 ఫ్యామిలీలో భాగంగా ప్రపంచంలోని మొట్టమొదటి ఫోల్డబుల్ పిసిని పరిచయం చేసింది. ఈ కంపెనీ చివరకు CES 2020 లో ప్రపంచంలోని మొట్టమొదటి ఫోల్డబుల్ PC ని తయారుచేసింది.

లెనోవా థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్

లెనోవా థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్ అనే పేరుతో దీనిని ఆవిష్కరించారు. లెనోవా సంస్థ దీనితో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8cx 5G కంప్యూట్ ప్లాట్‌ఫామ్‌తో పనిచేసే థింక్‌బుక్ ప్లస్‌ యోగా 5G PCని కూడా ఆవిష్కరించింది.

 

ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...

 

ధర

ధర

లెనోవా యొక్క ఫోల్డబుల్ PC డివైస్ ఈ సంవత్సరం మధ్యలో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. లెనోవా థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్‌ను $2,499 (సుమారు రూ.1,79,200) ధర వద్ద విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించనున్నది.

 

 

టాటా స్కై బింగే + అందిస్తున్న ఫీచర్స్ ఇవే...టాటా స్కై బింగే + అందిస్తున్న ఫీచర్స్ ఇవే...

డిస్ప్లే

డిస్ప్లే

ఈ ల్యాప్‌టాప్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 13.3-అంగుళాల POLED డిస్ప్లేను కలిగి ఉంది. దీనిని LG డిస్ప్లే తయారు చేసింది. ఈ ప్యానెల్ 2K (2048 x 1536 పిక్సెల్స్) రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. లెనోవా సంస్థ దాని ఫోల్డబుల్ డివైస్ బ్రాండ్ యొక్క మన్నిక విషయంలో గట్టి నమ్మకంతో ఉందని సంస్థ తెలిపింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం డిస్ప్లే యొక్క ప్యానెల్ను గీతలు నుండి రక్షించడానికి డిస్ప్లే క్రింద స్టెయిన్లెస్ స్టీల్ రేకు అమర్చబడి ఉన్నది అని తెలిపింది. అలాగే లెనోవా సంస్థ దాని పైన ప్రత్యేక కొటింగ్ ను కూడా జోడించింది. పోర్ట్రెయిట్ మోడ్‌లో దిగువ వైపున ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌ను కూడా ఉపయోగించగలుగుతారు. ఇది డిస్ప్లేను దాని యొక్క కోణంలో మడవటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

 

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివిసెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఫోల్డబుల్ పిసిని బ్లూటూత్ కలిగిన కీబోర్డ్‌తో సహా కంపెనీ విక్రయిస్తోంది. ఇది డిస్ప్లే యొక్క దిగువ భాగంలో అయస్కాంతంగా స్నాప్ అవుతుంది. యూజర్లు లెనోవా యొక్క కొత్త PC ని పూర్తిగా విడదీయడం ద్వారా దానిని స్టాండర్డ్ టాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. మీరు కొంచెం ఫోల్డ్ చేసి మరియు స్ప్లిట్-స్క్రీన్ మోడ్‌లో ఉంచి కూడా థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్ ను ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్ యొక్క పైభాగం పూర్తిగా సగానికి ముడుచుకున్నప్పుడు కూడా ఇది మానిటర్‌గా పనిచేస్తుంది.

ఫీచర్స్

ఫీచర్స్

ఈ ల్యాప్‌టాప్ యొక్క ఇతర ఫీచర్ లలో డాల్బీ స్టీరియో స్పీకర్లు, ఐదు మెగాపిక్సెల్ IR కెమెరా వంటివి మరిన్ని ఉన్నాయి. ల్యాప్‌టాప్‌ను నావిగేట్ చేయడానికి లేదా నోట్స్ రాయడానికి ఇది యాక్టివ్ పెన్నును కూడా కలిగి ఉంటుంది. లెనోవా ల్యాప్‌టాప్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్టాండ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. కానీ దాని కోసం మీరు సుమారు $ 23.99 ఖర్చు చేయవలసి ఉంటుంది.

 

 

Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...

స్టోరేజ్ & బ్యాటరీ

స్టోరేజ్ & బ్యాటరీ

లెనోవా థింక్‌ప్యాడ్ X1 ఫోల్డ్ ల్యాప్‌టాప్ విండోస్ 10 ప్రో ఆధారంగా రన్ అవుతుంది. ఇది 8 జిబి ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ ఒకే ఒక ఆప్షన్‌తో వస్తుంది. లెనోవా నుండి వచ్చిన ఈ ఫోల్డబుల్ PC 50 వాట్ల బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జీతో 11 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇది రాపిడ్ ఛార్జింగ్‌ మద్దతును కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Lenovo's First Foldable Laptop Feature,Price Revel

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X