క్వాల్కమ్ 850 చిప్‌సెట్‌తో లెనోవో ల్యాప్‍టాప్, బ్యాటరీ బ్యాకప్ 25 గంటలు
బెర్లిన్ వేదికగా జరుగుతోన్న IFA 2018 టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా లెనోవో, ప్రపంచపు మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ల్యాప్‌టాప్‌ను అనౌన్స్ చేసింది.
బెర్లిన్ వేదికగా జరుగుతోన్న IFA 2018 టెక్నాలజీ ట్రేడ్ షోలో భాగంగా లెనోవో, ప్రపంచపు మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ల్యాప్‌టాప్‌ను అనౌన్స్ చేసింది. లెనోవో యోగా సీ630 డబ్ల్యూఓఎస్ పేరుతో విడుదలైన ఈ ల్యాపీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 850 మొబైల్ కంప్యూట్ ఫ్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. క్వాల్కమ్-లెనోవో కాంభినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ శక్తివంతమైన డివైస్ ఏకంగా 25 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తుందట.

Lenovo Yoga C630 WOS స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..
13.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి ఐపీఎస్ టచ్ స్ర్కీన్ విత్ లెనోవో పెన్ సపోర్ట్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 850 మొబైల్ కంప్యూట్ ఫ్లాట్‌ఫామ్ విత్ అడ్రినో 630 గ్రాఫిక్స్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి), సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్, ఇంటిగ్రేటెడ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్20 ఎల్టీఈ-ఏ మోడెమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ విత్ యూఎస్బీ పవర్ డెలివరీ అండ్ డిస్‌ప్లే పోర్ట్ వీడియో అవుట్‌పుట్. ఈ లైట్‌వెయిట్ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోగ్రాములుగా ఉంటుందట.

మొదటి జనరేషన్ ఆర్మ్ బేసిడ్ విండోస్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే..
మొదటి జనరేషన్ ఆర్మ్ బేసిడ్ విండోస్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే స్నాప్‌డ్రాగన్ 850 మొబైల్ కంప్యూట్ ఫ్లాట్‌ఫామ్ వేగవంతమైన పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయగలగుతుందట. క్వాల్కమ్ ఈ సరికొత్త చిప్‌సెట్‌ను జూన్‌లో నిర్వహించిన కంప్యూటెక్స్ 2018లో భాగంగా లాంచ్ చేసింది. 10ఎన్ఎమ్ ప్రాసెస్ పై అభివృద్ధి చేయబడిన ఈ చిప్‌సెట్ 8 కస్టమ్ క్వాల్కమ్ క్రయో 385 కోర్‌లను కలిగి ఉంటుంది.

చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన అడ్రినో 360 గ్రాఫిక్స్..
ఈ చిప్‌సెట్‌కు ఇంటిగ్రేట్ చేసిన అడ్రినో 360 గ్రాఫిక్స్ అలానే స్నాప్‌డ్రాగన్ ఎక్స్20 ఎల్టీఈ మోడెమ్‌లు గేమింగ్ ఇంకా కనెక్టువిటీ స్పీడ్‌లను రెట్టింపు సామర్థ్యంతో ముందుకు నడిపిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ చిప్‌సెట్‌లో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్, ఆడియో, సెన్సార్స్, సెక్యూరిటీ ఇంకా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ విభాగాల నిమిత్తం డెడికేటెడ్ బ్లాక్స్ ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ ల్యాపీ ధర €999 (రూ.80,000) వరకు ఉండొచ్చని అంచనా..
ఇండియన్ మార్కెట్లో Yoga C630 WOS అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. యూరోపియన్ మార్కెట్లో నవంబర్ నుంచి ఈ డివైస్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అక్కడి మార్కెట్లో ఈ ల్యాపీ ధర €999 (రూ.80,000) వరకు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








