Home
Gadgets

ప్రీమియం LG 300W డాల్బీ సౌండ్‌బార్.. ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు.. వెంటనే డీల్ పట్టేయండి..

LG 300W Dolby Soundbar: మీరు మంచి పవర్ ఉన్న, బడ్జెట్ ఫ్రెండ్లీ సౌండ్‌బార్ కోసం చూస్తున్నారా.. అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. LG 300W డాల్బీ సౌండ్‌బార్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. దమ్మున్న బేస్‌కి, అదిరిపోయే ఆడియోకి పేరుగాంచిన ఈ సౌండ్‌బార్ ఇప్పుడు కేవలం రూ.12,988కే మీ సొంతం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి, వాటితో కలిపి చూస్తే ఇది రూ.12,000లోపే వచ్చేస్తుంది.

బ్రాండెడ్ సౌండ్‌బార్ కావాలి, సౌండ్ మాత్రం అదిరిపోవాలి, కానీ ఎక్కువ డబ్బు పెట్టకూడదు అనుకుంటే, ఇది మిస్ అవ్వకూడని డీల్. LG 2.1 ఛానల్ సౌండ్‌బార్ S40T ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని అసలు ధర బాగా తగ్గించేశారు.

LG 300W Dolby Soundbar Drops to Its Lowest Price Ever  Grab the Deal Now

అంతేకాదు, ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లోనూ బ్యాంక్ ఆఫర్లతో ఎక్స్‌ట్రా మనీ సేవ్ చేసుకోవచ్చు. అమెజాన్ రూ.1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ HDFC, BOBCARD క్రెడిట్ కార్డులపై రూ.1,299 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్లు అన్నీ కలిపితే, ఇది రూ.12,000 కంటే తక్కువకి వచ్చేస్తుంది. మార్కెట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ సౌండ్‌బార్స్‌లో ఇది ఒకటి.

* LG 300W డాల్బీ సౌండ్‌బార్ – ఫీచర్లు

ఈ LG సౌండ్‌బార్‌లో రెండు స్పీకర్లు ఉన్న ఒక బార్, వైర్‌లెస్ సబ్‌ వూఫర్ ఉంటాయి. ఈ సబ్‌ వూఫర్ అదిరిపోయే, పవర్‌ఫుల్ BASSను అందిస్తుంది. మొత్తం 300W RMS సౌండ్ ఔట్‌పుట్‌తో, ఇది నిజమైన హోమ్ థియేటర్ అనుభూతిని ఇస్తుంది. ఇది డాల్బీ ఆడియో, డీటీఎస్ డిజిటల్ సౌండ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

దీనివల్ల ఆడియో క్వాలిటీ ఇంకా బాగుంటుంది, బాస్ డెప్త్ కూడా పెరుగుతుంది. క్రెస్ట్ డిజైన్‌తో ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది, మీ ఇంటి ఇంటీరియర్‌తో ఈజీగా కలిసిపోతుంది. ఇంకా బ్లూటూత్, ఆప్టికల్, HDMI కనెక్టివిటీ కూడా ఉన్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

* సోనీ HT-S2000 సౌండ్‌బార్‌పైనా డిస్కౌంట్‌

ఇంకాస్త అడ్వాన్స్‌డ్ హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలనుకునే వాళ్ల కోసం, సోనీ HT-S2000 5.1ch డాల్బీ అట్మాస్ సౌండ్‌బార్ కూడా భారీ డిస్కౌంట్‌లో ఉంది. దీని అసలు ధర రూ.1,17,970. అమెజాన్‌లో డిస్కౌంట్ ధర రూ.69,990 (41% తగ్గింపు). ఈ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌లో డాల్బీ అట్మాస్, DTSX, వైర్‌లెస్ సబ్ వూఫర్ ఉన్నాయి.

ఇవి సినిమా హాల్లో ఉన్నట్టు సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. ఇందులో బిల్ట్-ఇన్ సబ్ వూఫర్, సెంటర్ స్పీకర్ కూడా ఉన్నాయి, డైలాగులు స్పష్టంగా వినిపిస్తాయి. BASS కూడా అదిరిపోతుంది. సోనీ వెర్టికల్ సరౌండ్ ఇంజిన్‌తో, సీలింగ్ లేదా పైకి సౌండ్ వెళ్లే స్పీకర్లు లేకుండానే 3D ఆడియోని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.

S-ఫోర్స్ ప్రో టెక్నాలజీ సౌండ్‌ని రెండు వైపుల నుంచి రీప్రొడ్యూస్ చేస్తుంది, దీనివల్ల సినిమాలు మరియు పాటలు మరింత ఇమ్మర్సివ్‌గా ఉంటాయి. అంతేకాదు, స్టీరియో కంటెంట్‌ని కూడా 3D ఎఫెక్ట్‌తో వినేలా అప్‌మిక్సర్ టెక్నాలజీ ఉంది. HEC యాప్ ద్వారా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు.

సిస్టమ్ సెటప్ కూడా ఫోన్ నుంచే ఈజీగా చేసుకోవచ్చు. ఇది వైర్‌లెస్ సబ్ వూఫర్లు, వెనుక స్పీకర్‌లతో వస్తుంది, ఇంట్లో కూర్చొనే థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ని మరింత పెంచుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
LG 300W Dolby soundbar deal offers powerful sound at lowest price with bank discounts. Sony Dolby Atmos soundbar also heavily discounted for premium home theater experience.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X