ప్రపంచానికి ఊహించని షాకిచ్చిన LG, మడతపెట్టే టీవితో సంచలనం

By Hazarath
|

టెలివిజన్లు, కంప్యూటర్‌ తెరలు, మొబైల్‌ఫోన్లను కాగితం మాదిరిగా ఉండచుట్టేయవచ్చని.. ఇది మేమే తయారుచేసి నిరూపిస్తామంటూ LG చెప్పిన విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు ఎల్‌జీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే యూహెచ్‌డీ ఓఎల్‌ఈడీ టీవీని లాంచ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ టివిని ప్రపంచానికి పరిచయం చేసింది. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

జియోపై ముప్పేట దాడి, సరికొత్త డేటా ఆఫర్లతో దూసుకొచ్చిన టెలికాం దిగ్గజాలు !జియోపై ముప్పేట దాడి, సరికొత్త డేటా ఆఫర్లతో దూసుకొచ్చిన టెలికాం దిగ్గజాలు !

రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో..

రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో..

రిమోట్‌ కంట్రోల్‌ సాయంతోనే స్క్రీన్‌ను ఎలా కావాలంటే అలా వంపుకునే అవకాశం ఉండటం ఈ సరికొత్త ఎల్‌జీ ఓలెడ్‌ టీవీ ప్రత్యేకత. ఒక్కసారి ఫొటోలను చూస్తే ఈ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.

 65 అంగుళాల వెడల్పుతో..

65 అంగుళాల వెడల్పుతో..

దాదాపు 65 అంగుళాల వెడల్పుతో ఈ టివి అక్కడ కనివిందు చేసింది. ఎల్‌జీ అని రాసి ఉన్న డబ్బాలో ఉండ చుట్టుకుని ఉండే ఈ టెలివిజన్‌ అవసరమైనప్పుడు పైకి వచ్చేస్తుంది.

మనకు అవసరమైనంత మేరకే ..

మనకు అవసరమైనంత మేరకే ..

ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే మనకు అవసరమైనంత మేరకే ఈ టివిని వాడుకోవచ్చు. అంటే టివిలో కొంత భాగం మాత్రమే పనిచేసేలా దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు.

ఐపీఎస్ టెక్నాలజీని..
 

ఐపీఎస్ టెక్నాలజీని..

65 అంగుళాల తెరకు ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసి ఐపీఎస్ నానో కలర్, యూ ఐపీఎస్‌లను అమలు చేయనున్నట్లు ఎల్‌జీకి చెందిన డిస్‌ప్లే డివిజన్ ప్రకటించింది.

ఆర్ట్ గ్లాస్ డిస్‌ప్లేలను..

ఆర్ట్ గ్లాస్ డిస్‌ప్లేలను..

వీటితో పాటు టీవీలకు 65 అంగుళాల ఆర్ట్ గ్లాస్ డిస్‌ప్లే, మానిటర్లకు 14 అంగుళాలు, 31.5 అంగుళాల ఆర్ట్ గ్లాస్ డిస్‌ప్లేలను సీఈఎస్‌లో భాగంగా ఆవిష్కరించింది.

88 అంగుళాల 8కే ఓఎల్‌ఈడీ టీవీని..

88 అంగుళాల 8కే ఓఎల్‌ఈడీ టీవీని..

దీంతో పాటు 88 అంగుళాల 8కే ఓఎల్‌ఈడీ టీవీని కూడా ఇదే షోలో ఎల్‌జీ లాంచ్ చేసింది. కాగా ప్రపంచంలో ఇదే తొలి 88 అంగుళాల 8కే రిజల్యూషన్ టీవీ.

 శాంసంగ్‌కు చెందిన 146 అంగుళాల 4కే టీవీ

శాంసంగ్‌కు చెందిన 146 అంగుళాల 4కే టీవీ

ఇక ఇతర కంపెనీల విషయానికి వస్తే శాంసంగ్‌కు చెందిన 146 అంగుళాల 4కే టీవీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి ద వాల్ అన్న పేరు పెట్టారు.

వినియోగదారులకు అందించే ఆలోచన..

వినియోగదారులకు అందించే ఆలోచన..

అయితే ఎల్‌జీ ఆవిష్కరించిన టీవిని వినియోగదారులకు అందించే ఆలోచన ఇంకా చేయలేదని కంపెనీ చెబుతోంది. ఈ విషయంలో యూజర్లు కొంచెం నిరాశ పడాల్సిందే.

 

 

Best Mobiles in India

English summary
LG reveals 65-inch OLED rollable TV, 4K Projector, refrigerator with 29-inch touch screen More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X