LG నుంచి సూపర్ డిజైన్, అవుట్‌పుట్ సహా ప్రత్యేక ఫీచర్‌లతో స్పీకర్లు విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
ప్రముఖ గ్యాడ్జెట్ ల తయారీ సంస్థ LG భారత్ మార్కెట్ లో (LG India) స్పీకర్లను విడుదల చేసింది. XBoom సిరీస్ పేరుతో మూడు స్పీకర్లను (LG XBOOM Series Speakers Launched) అందుబాటులోకి తీసుకొచ్చింది. XL9T, XG2T, XO2T మోడళ్ల ను లాంచ్ చేసింది. లైటింగ్ ఫీచర్ లు, పోర్టబిలిటీ, మెరుగైన సౌండ్ క్వాలిటీ ని కలిగి ఉంటాయని LG సంస్థ తెలిపింది. ఇంట్లో లేదా ప్రత్యేక ఈవెంట్ లో వినియోగించుకొనేందుకు ఈ సిరీస్ సౌండ్ స్పీకర్లు సౌకర్యంగా ఉంటాయని తెలిపింది.
XL9T స్పీకర్ ఫీచర్‌ల వివరాలు :
LG XBoom XL9T ను పార్టీ స్పీకర్ గా లాంచ్ చేసింది. ఈ స్పీకర్ 8 అంగుళాల వూఫర్ లు, 3 అంగుళాల ట్వీటర్‌లను కలిగి ఉంటుంది. మరియు 1000W అవుట్‌పుట్ ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. ప్రత్యేక ఈవెంట్స్, పార్టీలకు ఈ స్పీకర్ అనుకూలంగా ఉంటుందని తెలిపింది.

ఈ పార్టీ స్పీకర్ పిక్సల్ LED తో కూడిన వూఫర్ లైటింగ్ ను కలిగి ఉంటుంది. బాస్ ఎన్‌హేన్స్‌మెంట్ అల్గారిథమ్ తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌండ్ స్పీకర్ IPX4 రేటింగ్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ స్పీకర్లను అవుట్‌డోర్ పార్టీలు సహా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా వీల్స్ ను కలిగి ఉన్నాయి. దీని ధర రూ.64900 గా ఉంది.
ఎల్‌జీ XG2T స్పీకర్ వివరాలు :
XG2T స్పీకర్ పోర్టబుల్ డిజైన్‌తో (LG XBOOM XG2T Speaker) విడుదల చేసింది. 1.5 అంగుళాల వూఫర్ మరియు పాసివ్ రేడియేటర్‌తో 5W అవుట్‌పుట్ ను అందిస్తుంది. ఈ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. US మిలిటరీ స్టాండర్డ్ మన్నికను అందిస్తుందని సంస్థ చెబుతోంది. మరియు IP67 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 10 గంటల ప్లేబ్యాక్ టైం అందిస్తుందని సంస్థ తెలిపింది.
ఎల్‌జీ XO2T స్పీకర్ వివరాలు :
XO2T స్పీకర్ IP55 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సింగిల్ ఛార్జింగ్ తో 15 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన లైటింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ (LG XBOOM X02T Speaker) 360 డిగ్రీల ఓమ్ని డైరెక్షనల్ 20W సౌండ్ అవుట్‌పుట్ ను అందిస్తుంది.
ఈ స్పీకర్ లు బ్లూటూత్ 5.3 తో పనిచేస్తుంది. మరియు LG వన్ టచ్ మోడ్, మల్టీ పాయింట్ షేరింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయని LG తెలిపింది. LG XG2T బ్లూటూత్ స్పీకర్ ధర రూ.4990, అదే XO2T ధర రూ.12990, XL9T పార్టీ స్పీకర్ ధర రూ.64900 గా ఉంది. ఈ స్పీకర్ల సేల్ వివరాలను కూడా సంస్థ వెల్లడించింది. నవంబర్ 15 నుంచి LG.com సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం, రిటైల్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని LG తెలిపింది.


Click it and Unblock the Notifications








