రూ.10 వేల లోపు బెస్ట్ ట‌వ‌ర్ మోడ‌ల్ Speakers కోసం ఓ లుక్కేయండి!

|

ఇటీవ‌లి కాలంలో చాలా మంది త‌మ‌ ఇళ్ల‌ల్లో స్మార్ట్ టీవీలు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఇష్ట‌ప‌డుతున్నారు. త‌ద్వారా స్మార్ట్ టీవీల్లో సినిమాల‌ను చూడ‌టానికి మంచి సౌండ్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో Speakers కు మంచి డిమాండ్ ఏర్పడింది. భార‌త మార్కెట్లో ప్ర‌స్తుతం మ్యూజిక్ ప్రియుల ఆస‌క్తుల‌కు అనుగుణంగా ర‌క‌ర‌కాల స్పీక‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ కంపెనీలు మంచి బేస్‌, మ‌రియు బెస్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన ట‌వ‌ర్ Speakers ను కూడా వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్ర‌మంలో రూ.10 వేల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ Tower Speakers జాబితాను మీ కోసం మేం అందిస్తున్నాం. ఒక‌వేళ మీరు ట‌వ‌ర్ మోడ‌ల్‌ను స్పీక‌ర్ కొనాల‌ని భావిస్తే ఈ జాబితాపై ఓ లుక్కేయండి.

 
రూ.10 వేల లోపు బెస్ట్ ట‌వ‌ర్ మోడ‌ల్ Speakers కోసం ఓ లుక్కేయండి!

Elista ELS ST 8000 - AUFB సింగిల్ ట‌వ‌ర్ స్పీక‌ర్‌:
ఎలిస్టా కంపెనీకి చెందిన ఈ స్పీక‌ర్ ధ‌ర రూ.7,199 గా ఉంది. ట‌వ‌ర్ ఆకారంలో ఉండే ఈ స్పీక‌ర్ 80 W సామ‌ర్థ్యంతో సౌండ్‌ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. దీనికి 8 అంగుళాల వూఫ‌ర్‌ను ఇస్తున్నారు. ఇది మంచి ఆడియో బేస్ అనుభూతిని క‌లిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ల‌కు, స్మార్ట్ టీవీల‌కు, టాబ్లెట్ల‌కు మంచి క‌నెక్టివిటీని క‌లిగి ఉంటుంది. దీనికి బ్లూటూత్ వ‌ర్శ‌న్ 5.1 ను అందిస్తున్నారు. బ్లూటూత్ 10 మీటర్ల‌ రేంజ్ వ‌ర‌కు ప‌నిచేస్తుంది. వైర్‌లెస్‌లో దీన్ని ఆప‌రేట్ చేసేందుకు రిమోట్ సౌక‌ర్యం ఇస్తున్నారు. ఈ స్పీక‌ర్లు ఎలిస్టా ఎక్స్‌టెన్సివ్ రిటైల్ అవుట్‌లెట్ల‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.

రూ.10 వేల లోపు బెస్ట్ ట‌వ‌ర్ మోడ‌ల్ Speakers కోసం ఓ లుక్కేయండి!

PHILIPS SPA9075B/94 బ్లూటూత్ ట‌వ‌ర్ స్పీక‌ర్‌:
ఫిలిప్స్ కంపెనీకి చెందిన ఈ ట‌వర్ స్పీక‌ర్ 75 W ప‌వ‌ర్ అవుట్‌పుట్ క‌లిగిన ఈ బ్లూ టూత్ స్పీకర్ 2.1 ఛానెల్ కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగి ఉంది. ఇది 40 Hz - 20 kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ క‌లిగి ఉంది. ఈ స్పీక‌ర్ల ద్వారా మంచి ఆడియో అనుభూతిని పొంద‌వ‌చ్చు. ఈ స్పీక‌ర్ల‌కు బ్లూటూత్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నారు. ఎఫ్ఎం రేడియో ఆస్వాదించ‌డానికి కూడా అవ‌కాశం క‌ల్పించారు. బ్లూటూత్‌ క‌నెక్ష‌న్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను మ‌నం ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. వీటి ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,990 గా ఉంది. ప్ర‌స్తుతానికి ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అవుట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నాయి. ఈ స్పీక‌ర్లు ఏడాది పాటు వారెంటీతో వ‌స్తాయి. ఇవి వెడ‌ల్పు 30సెం.మీ., పొడ‌వు 97.5 సెం.మీ., సైజులు క‌లిగి ఉంటాయి. దీనికి ఆన్‌లైన్‌లో మంచి రేటింగ్ కూడా ఉంది.

Gizmore GIZ ST5000 బ్లూటూత్ స్పీక‌ర్‌:
గిజ్‌మోర్ కంపెనీకి చెందిన ఈ ట‌వ‌ర్ మోడ‌ల్ స్పీక‌ర్ 50 W సౌండ్‌ అవుట్‌పుట్ తో మంచి సౌండ్ బేస్‌ను క‌లిగి ఉన్నాయి. ఇది స్టీరియో ఛానెల్ కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగి ఉంది. ఇవి అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో దీని ధ‌ర రూ.3,499 గా ఉంది. ఈ స్పీక‌ర్లు వైర్‌డ్ మైక్ క‌నెక్టివిటీ స‌దుపాయాన్ని క‌లిగి ఉన్నాయి. అంతేకాకుండా బ్లూటూత్ ఫీచ‌ర్‌తో, రిమోట్ కంట్రోల్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నారు. బ్లూటూత్‌ క‌నెక్ష‌న్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. వీటి ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,795 గా ఉంది. ప్ర‌స్తుతానికి ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పీక‌ర్లు ఏడాది పాటు వారెంటీతో వ‌స్తాయి. ఇవి వెడ‌ల్పు 14.3సెం.మీ., పొడ‌వు 63.6 సెం.మీ., సైజులు క‌లిగి ఉంటాయి.

 
రూ.10 వేల లోపు బెస్ట్ ట‌వ‌ర్ మోడ‌ల్ Speakers కోసం ఓ లుక్కేయండి!

ZEBRONICS బ్లూటూత్ ట‌వ‌ర్ స్పీక‌ర్‌:
జెబ్రొనిక్స్ కంపెనీకి చెందిన ఈ ట‌వ‌ర్ మోడ‌ల్ స్పీక‌ర్ మోడ‌ల్ నంబ‌ర్ ZEB-BT7300RUCF ను క‌లిగి ఉంది. 90 W ప‌వ‌ర్ అవుట్‌పుట్ క‌లిగిన ఈ బ్లూ టూత్ స్పీకర్ 2.0 ఛానెల్ కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగి ఉంది. ఈ స్పీక‌ర్ల ద్వారా మంచి ఆడియో అనుభూతిని పొంద‌వ‌చ్చు. ఇది రిమోట్ కంట్రోల్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. దీనికి రెండు స్పీక‌ర్ యూనిట్లు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ స్పీక‌ర్ల‌కు బ్లూటూత్ సౌక‌ర్యం క‌ల్పిస్తున్నారు. బ్లూటూత్‌ క‌నెక్ష‌న్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను మ‌నం ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. వీటి ధ‌ర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,795 గా ఉంది. ప్ర‌స్తుతానికి ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పీక‌ర్లు ఏడాది పాటు వారెంటీతో వ‌స్తాయి. ఇవి వెడ‌ల్పు 37.5సెం.మీ., పొడ‌వు 73.8 సెం.మీ., సైజులు క‌లిగి ఉంటాయి.

ELS ST 8000 మినీ సింగిల్ ట‌వ‌ర్ స్పీక‌ర్‌:
ఈ ట‌వ‌ర్ మోడ‌ల్ స్పీక‌ర్ 60 W సౌండ్‌ అవుట్‌పుట్ తో మంచి సౌండ్ బేస్‌ను క‌లిగి ఉన్నాయి. దీనికి బ్లూటూత్ వ‌ర్శ‌న్ 5.1 ను అందిస్తున్నారు. ఇవి అఫ‌ర్డ‌బుల్ ధ‌ర‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో దీని ధ‌ర రూ.4,990 గా ఉంది. ఈ స్పీక‌ర్లు వైర్‌డ్ మైక్ క‌నెక్టివిటీ స‌దుపాయాన్ని క‌లిగి ఉన్నాయి. అంతేకాకుండా బ్లూటూత్ ఫీచ‌ర్‌తో, రిమోట్ కంట్రోల్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నారు. బ్లూటూత్‌ క‌నెక్ష‌న్ ద్వారా వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను మ‌నం ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఈ స్పీక‌ర్‌ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి క‌లిగిన వినియోగ‌దారులు ఎలిస్టా కంపెనీ వెబ్‌సైట్ లేదా కంపెనీ రిటైల్ అవుట్‌లెట్ల నుంచి నేరుగా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
List Of Best Sub-10K Tower Speakers In 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X