Home
Gadgets

12 నెలల బ్యాటరీ లైఫ్‌, రెండు చేతులతో వినియోగించుకోగలిగే Wireless Mouse విడుదల.. ఫీచర్‌లు, ధర వివరాలు..!

ప్రస్తుతం అనేక మంది వైర్‌లెస్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా సంస్థలు వైర్‌లెస్ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. వైర్‌లెస్‌ మౌస్‌, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌, కీబోర్డు సహా మరిన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ Logitech తాజాగా వైర్‌లెస్‌ మౌస్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 12 నెలలపాటు వినియోగించుకోవచ్చు. విండోస్‌, macOS పరికరాలకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. డిజైన్, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

లాజిటెక్‌ M196 పేరుతో వైర్‌లెస్‌ మౌస్‌ ను (Logitech M196 Wireless Mouse) అందుబాటులో ఉంది. ఆకట్టుకొనే డిజైన్‌తో తక్కువ ధరలోనే విడుదల చేసింది. ఈ వైర్‌లెస్‌ మౌస్‌ కుడి, ఎడమ చేతులతో వినియోగించుకొనే విధంగా రూపొందించారు. ఈ మౌస్‌ లో ఎక్కువ భాగం రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

Logitech M196 Wireless Mouse launched

లాజిటెక్‌ M196 వైర్‌లెస్‌ మౌస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
లాజిటెక్‌ వైర్‌లెస్‌ మౌస్‌ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. ఫలితంగా కుడి, ఎడమ చేతులతో వినియోగించుకొనేందుకు అనువుగా ఉంటుంది. ఈ మౌస్‌ 1000 DPI ఆప్టికల్‌ సెన్సార్‌ మరియు స్కోలింగ్ వీల్‌ను కలిగి ఉంది. ఈ మౌస్‌ బ్యాటరీలతో కలిపి కేవలం 76 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఈ వైర్‌లెస్ మౌస్‌ (Logitech Wireless Mouse) బ్లూటూత్‌ LE కనెక్టివిటీని కలిగి ఉంటుంది. మరియు విండోస్‌, macOS పరికరాల్లో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ లాజిటెక్‌ M196 మౌస్‌ కనెక్ట్‌ స్విచ్‌ను కలిగి ఉంది. 10 మీటర్‌ దూరం నుంచి కూడా పరికరాలతో కనెక్ట్ చేయవచ్చని సంస్థ చెబుతోంది.

Logitech M196 Wireless Mouse launched

ఆటో స్లీప్‌ ఫీచర్‌ : ఈ లాజిటెక్‌ M196 వైర్‌లెస్‌ మౌస్‌ సింగిల్‌ AA బ్యాటరీతో పనిచేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 12 నెలలపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ మౌస్‌ ఆటో స్లీప్‌ ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ కాలంపాటు వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. ఈ వైర్‌లెస్‌ మౌస్‌ లైన్‌ బై లైన్ స్కోలింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

వైర్‌లెస్‌ మౌస్‌ ధర, సేల్‌ పూర్తి వివరాలు :
Logitech M196 వైర్‌లెస్‌ మౌస్‌ భారత్‌ మార్కెట్‌లో అనేక స్టోర్‌లలో (Logitech M196 Sale)అందుబాటులో ఉంటుంది. ఈ మౌస్‌ గ్రాఫైట్‌, ఆఫ్‌ వైట్‌, రోజ్‌ రంగుల్లో లభిస్తుంది. ధర రూ.1125 గా ఉంది. ఈ వైర్‌లెస్‌ మౌస్‌ సుమారు 67 శాతం రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు లాజిటెక్‌ సంస్థ తెలిపింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Logitech M196 Wireless Mouse with 12 months battery life launched in india features sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X