గూగుల్ కొత్తగా లాంచ్ చేసినవి ఇవే !
గూగుల్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లను తాజాగా విడుదల చేసిన విషయం విదితమే.
గూగుల్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లను తాజాగా విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లతోపాటు పలు ఇతర గ్యాడ్జెట్లను కూడా గూగుల్ విడుదల చేసింది. వాటిల్లో మినీ స్మార్ట్ స్పీకర్, గూగుల్ పిక్సల్ బుక్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్
ఈ డివైస్ ద్వారా యూజర్లు మ్యూజిక్ వినవచ్చు. స్మార్ట్‌హోమ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. క్యాలెండర్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో సమాచారం వెదకవచ్చు. ఈ నెల 19వ తేదీ నుంచి 49 డాలర్లకు (రూ.3,100) ఈ డివైస్ లభ్యం కానుంది.

గూగుల్ పిక్సల్ బుక్
దీన్ని ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీగా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 12.3 ఇంచ్ డిస్‌ప్లే, 2400 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, 8/16 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్, క్రోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4కె డిస్‌ప్లే అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.65వేల ప్రారంభ ధరకు ఈ ల్యాప్‌టాప్ ఈ నెల 31వ తేదీ నుంచి లభ్యం కానుంది.

గూగుల్ హోమ్ మ్యాక్స్ ప్రీమియం స్మార్ట్ స్పీకర్
గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్ లాగే ఈ డివైస్ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఏర్పాటు చేశారు. రూ.25,960 ధరకు ఈ డివైస్ వినియోగదారులకు నవంబర్ 13 నుంచి లభ్యం కానుంది.

పిక్సల్ బడ్స్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్
ఇవే కాకుండా సరికొత్త డే డ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్‌సెట్‌ను, పిక్సల్ బడ్స్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను, క్లిప్స్ పేరిట సరికొత్త ఏఐ పవర్డ్ కెమెరాను కూడా గూగుల్ విడుదల చేసింది. వీఆర్ హెడ్‌సెట్ రూ.6,400 ధరకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. పిక్సల్ బడ్స్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు రూ.10,350 ధరకు నవంబర్ మొదటి వారంలో లభ్యం కానున్నాయి. క్లిప్స్ కెమెరా రూ.16,200 ధరకు అతి త్వరలో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








