రెడ్‌మి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్.. 14 రోజుల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ కాలింగ్, IP68 రేటింగ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ షియోమీ భారత్ మార్కెట్ లో ఇవాళ రెడ్‌మి వాచ్ మూవ్ (Redmi Watch Move Smartwatch) స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది. తొలి రెడ్‌మి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్‌గా (Made In India Smartwatch) గుర్తింపు పొందింది. ఈ వాచ్ ఫిట్‌నెస్ తోపాటు అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. డిజైన్ పరంగాను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ హిందీను కూడా సపోర్టు చేస్తుంది.
రెడ్‌మి వాచ్ మూవ్ అనేక ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకర్ లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ వాచ్ 140 కంటే ఎక్కువ వాచ్ మోడ్స్ ను సపోర్టు చేస్తుంది. మరియు ఎక్కువ రోజులపాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని షియోమీ చెబుతోంది. ఏప్రిల్ 24 నుంచి ముందస్తు ఆర్డర్ లు చేయవచ్చు.

రెడ్‌మి వాచ్ మూవ్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి స్మార్ట్‌వాచ్ 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ Always On Display ఫీచర్ ను సపోర్టు చేస్తుంది.
ఈ రెడ్‌మి స్మార్ట్‌వాచ్ వాకింగ్, రన్నింగ్, యోగా వంటి సమయాల్లో 98.5 కచ్చితత్వంతో కూడిన వివరాలను అందిస్తుంది. దీంతోపాటు ఈ వాచ్ ఒత్తిడి, నిద్ర, హార్ట్ రేట్, SpO2 స్థాయిని కూడా ట్రాక్ చేస్తుంది. దీంతోపాటు మహిళల్లో రుతుక్రమానికి సంబంధించిన వివరాలను కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 14 రోజుల బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. అదే ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ఆన్ చేసి ఉండే 5 రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ అల్ట్రా బ్యాటరీ సెవర్ మోడ్ ను కూడా కలిగి ఉంది.
రెడ్‌మి వాచ్ మూవ్ HyperOS పైన పనిచేస్తుంది. నేవిగేషన్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. నేరుగా స్మార్ట్‌వాచ్ నుంచే కాల్ చేయడం, స్వీకరించవచ్చు. ఈ వాచ్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. క్యాలెండర్‌లు, వాతావరణ సమాచారం సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.
రెడ్‌మి వాచ్ మూవ్ ధర రూ.1999 గా ఉంది. మే 1 నుంచి సేల్ ప్రారంభం కానుంది. Mi.com, ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 24 నుంచి ముందస్తు ఆర్డర్‌లు చేయవచ్చు. ఈ వాచ్ గోల్డ్ రష్, సిల్వర్ స్ర్పింట్, బ్లాక్ డ్రిఫ్ట్, బ్లూ బ్లేజ్ వంటి రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మి నుంచి తొలిసారిగా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌వాచ్‌గా వాచ్ మూవ్ లాంచ్ అయింది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి 14 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. మరియు స్మార్ట్‌వాచ్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. మొత్తంగా ఈ స్మార్ట్‌వాచ్ నాలుగు కలర్ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








