Xiaomi కొత్త టీవీల్లో కేక పుట్టించే ఫీచర్లు..
ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన షావోమి (Xiaomi) తన ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రో సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లో లాంచ్ చేసింది.
ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన షావోమి (Xiaomi) తన ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ప్రో సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ ఎల్ఈడి టీవీ 4సీ ప్రో (32-ఇంచ్), ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో (49-ఇంచ్), ఎంఐ ఎల్ఈడి టీవీ 4 ప్రో (55-ఇంచ్) మోడల్స్‌లో ఈ టీవీలు అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్ 10 నుంచి అమ్మకాలు..
వీటిలో మొదటి రెండు మోడల్స్ రూ.29,999, రూ.14,999 ధర ట్యాగ్‌లతో లభ్యమవుతాయి. మూడవ మోడల్ అయిన ఎంఐ ఎల్ఈడి టీవీ 4 ప్రో రూ.49,999 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 10 నుంచి సేల్ జరుగుతుంది. ఈ కొత్త టీవీలు పాత మోడల్ అయిన ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏతో పోలిస్తే అప్‌డేటెడ్ ఫీచర్లను కలిగి కలిగి ఉన్నాయని కంపెనీ చెబుతోంది.

గతంలో లాంచ్ అయిన టీవీ ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో..
షావోమి నుంచి గతంలో లాంచ్ అయిన ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ కస్టమ్ ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్ వివిధ యాప్స్‌ను ఓపెన్ చేయవల్సిన అవసరం లేకుండా కంటెంట్‌ను నేరుగా హోమ్ స్క్రీన్ పైకి తీసుకువచ్చేస్తుంది. ఈ టీవీకి ఐఆర్ బ్లాస్టర్‌ను యాడ్ చేయటం ద్వారా స్ర్కీన్ పై లైవ్ టీవీ కంటెంట్‌ను వీక్షించే అవకాశాన్ని కల్పించారు.

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ సపోర్టుతో కొత్త టీవీలు...
ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ టీవీలలో గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ సపోర్టును షావోమి యాడ్ చేసింది. ఈ వెసలుబాటుతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావల్సిన యాప్స్‌ను టీవీలోకి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఇదే సమయంలో ఈ టీవీలో ఏర్పాటు చేసిన డ్యుయల్ ఇంటర్‌ఫేస్ మోడ్ ద్వారా మీ ప్రిఫరెన్సును బట్టి డిఫరెంట్ స్ర్కీన్ లను సెలక్ట్ చేసుకనే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్..
ఇక వాయిస్ విషయానికి వచ్చేసరికి షావోమి నుంచి లాంచ్ అయిన మూడు కొత్త టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ వాయిస్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తాయి. దీంతో వాయిస్ కమాండ్స్ సహాయంతో టీవీలను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది. టీవీ రిమోట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వాయిస్ బటన్ ద్వారా ఈ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది.

బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్...
షావోమి నుంచి లాంచ్ అయిన కొత్త స్మార్ట్ టీవీలు బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్‌తో వస్తుండటం విశేషం. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీ స్ర్కీన్‌లోకి మిర్రర్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో Netflix ఇంకా ఇతర ఆఫ్‌లైన్ మీడియా కంటెంట్‌ను కూడా ఈ టీవీలలో వీక్షించే వీలుంటుంది. వీడియో ఆన్ డిమాండ్ ప్రొవైడర్స్‌కు సంబంధించి 7 లక్షల పై చిలుకు వీడియో కంటెంట్ ఈ టీవీల్లో అందుబాటులో ఉంటుందని షావోమి తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతానికి హాట్‌స్టార్, హంగామా, సోనీ లైవ్, వూట్, ఈరోస్ నౌ, జీ5 వంటి యాప్‌లను సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే జియో సినిమా, హుక్, ఎపిక్ ఆన్, అమెజాన్ ప్రై వీడియో వంటి యాప్ లను కూడా సపోర్ట్ చేయబోతోంది.


Click it and Unblock the Notifications








