మరో 3 స్మార్ట్‌టీవీలతో షియోమి సంచలనం, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన చైనీస్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం షియోమి ‘స్మార్ట్‌ లివింగ్‌’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది.

|

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన చైనీస్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం షియోమి 'స్మార్ట్‌ లివింగ్‌' పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది.ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ను, స్మార్ట్‌ సెక్యురిటీ సిస్టమ్‌ను, ఫిట్‌నెస్‌ బ్యాండ్లను, స్మార్ట్‌ టీవీలతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఐదు సరికొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్‌లను, ఎంఐ బ్యాండ్‌ 3, ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌, ఎంఐ హోమ్‌ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.32 వేలు, అమ్మేది మాత్రం లక్షా నలభై వేలకి !ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.32 వేలు, అమ్మేది మాత్రం లక్షా నలభై వేలకి !

ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్‌లో..

ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్‌లో..

గతేడాది లాంచ్‌ చేసిన టీవీలకు సక్సెసర్‌గా షియోమి ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్‌లో మూడు స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేసింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్‌ సైజ్‌లో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్‌లోకి వచ్చాయి.

32 అంగుళాల టీవీ

32 అంగుళాల టీవీ

32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్‌ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్‌ ధర 49,999 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. కాగా55 అంగుళాల టీవీ ప్రపంచంలో పలుచైన టీవీగా కంపెనీ తెలిపింది.

ప్రత్యేకత
 

ప్రత్యేకత

ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్‌వేర్‌. ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్‌ యూఐ రిఫ్రెస్‌తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్‌ లేదా ప్యాచ్‌వాల్‌ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు.

ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌

ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌

ఆండ్రాయిడ్‌ సపోర్ట్‌తో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్‌ సపోర్టు కూడా ఉంది. రిమోట్‌లోనే వాయిస్‌ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది.

55 అంగుళాల టీవీ

55 అంగుళాల టీవీ

55 అంగుళాల టీవీ 4కే ప్లస్‌ హెచ్‌డీఆర్‌ సపోర్ట్‌తో వచ్చింది. డోల్బే ప్లస్‌ డీటీఎస్‌ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్‌ 5.0, 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి.

ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌

ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌

దీంతో పాటు ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే, లేజర్‌ సెన్సార్‌, 360 డిగ్రీల ట్రిపుల్‌ లేయర్‌ ఫిల్టర్‌తో ఈ డివైజ్‌ రూపొందించింది.

ఎంఐ యాప్‌ ద్వారా ..

ఎంఐ యాప్‌ ద్వారా ..

ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్‌ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ అమెజాన్‌ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్‌ అసిస్టెంట్‌ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్‌ చేస్తుంది.

అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ..

అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో ..

ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2ఎస్‌ తొలి సేల్‌ను సెప్టెంబర్‌ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది . దీన్ని ఎంఐ.కామ్‌, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు.ఆ తర్వాత ఎంఐ హోమ్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షియోమి ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ 2 ను కూడా రూ.8,999కే విక్రయిస్తున్నారు.

ఎంఐ హోమ్‌ సెక్యురిటీ కెమెరా 360

ఎంఐ హోమ్‌ సెక్యురిటీ కెమెరా 360

టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్‌లో ఎంఐ హోమ్‌ సెక్యురిటీ కెమెరాను షియోమి తీసుకొచ్చింది. ఫుల్‌ హెచ్‌డీ వీడియో రికార్డింగ్‌, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్‌, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్‌ డిటెక్షన్‌, 64జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్‌ చేసుకోవచ్చు.

ఎంఐ లగేజ్‌

ఎంఐ లగేజ్‌

20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షియోమి ఎంఐ లగేజ్‌ను లాంచ్‌ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్‌ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్‌ రంగుల్లో ఇది మార్కెట్‌లోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
Xiaomi Launches New Mi TV Models in India, MI Band 3 and Mi Air Purifier 2S Unveiled Too: Highlights more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X