అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో Mi Smart Band 7.. లాంచ్ ఎప్పుడంటే!

|

భార‌త్‌లో Mi Smart Band 7 త్వ‌ర‌లో విడుద‌ల కానుంద‌ని వ‌స్తున్న వార్త‌ల క్ర‌మంలో ఆ ప్రోడ‌క్టును ఆ సంస్థ యూర‌ప్ మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సంబంధిత టెక్ వ‌ర్గాలు స‌మాచారం వెల్ల‌డించాయి. కాగా అత్య‌ధిక ఛార్జింగ్ లైఫ్ ఫీచ‌ర్‌తో విడుద‌లైన ఈ స్మార్ట్ బ్యాండ్ అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ Mi Smart Band 7 ఇప్ప‌టికే చైనా మార్కెట్లో మే నెల‌లో విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం. భార‌త్‌లో ఇప్ప‌టికే ఈ స్మార్ట్ బ్యాండ్‌కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ‌ర్డ్స్ సంస్థ గుర్తింపు ద‌క్క‌డం విశేషం. ఈ ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌ను ఒక‌సారి ఛార్జ్ చేయ‌డం ద్వారా అత్య‌ధికంగా 14 రోజుల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇది ఆరు క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో ఇది భార‌త్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది.

 
అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో Mi Smart Band 7.. లాంచ్ ఎప్పుడంటే!

Mi Smart Band 7 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ Mi Smart Band 7 మంచి ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ 1.62 అంగుళాల AMOLED డిస్‌ప్లే తో 192x490 pixels రిసొల్యూష‌న్ క‌లిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది. ఇది 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 326ppi పిక్సెల్ డెన్సిటీ క‌లిగి ఉంది. దాంతో పాటుగా ఇందులో స్కిప్పింగ్‌, జిమ్నాస్టిక్‌, టెన్నిస్ స‌హా 120 స్పోర్ట్స్ మోడ్ ఫీచ‌ర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాండ్ కు ఒక్క‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా 14 రోజుల బ్యాట‌రీ లైఫ్ వ‌స్తుంది. యూర‌ప్‌లో దీని ధ‌ర‌ను 59.99 యూరోలు (రూ.4,700) గా నిర్ణ‌యించారు.

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో Mi Smart Band 7.. లాంచ్ ఎప్పుడంటే!

త్వ‌ర‌లోనే భార‌త్‌లోనూ విడుద‌ల‌!
ఈ బ్యాండ్‌లో కాల్స్‌, మెసేజెస్ నోటిఫికేష‌న్ సౌక‌ర్యం ఉంటుంది. ఇది బ్లూటూత్ v5.2 వ‌ర్శ‌న్ ను క‌లిగి ఉంది. ఈ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ వాట‌ర్ రెసిస్టెంట్ గా ప‌ని చేస్తుంది. దీన్ని గ‌తేడాది ఇదే కంపెనీ నుంచి విడుద‌లైన Mi Smart Band 6 కు స‌క్సెస‌ర్ మోడ‌ల్‌గా చెప్ప‌వ‌చ్చు. ఇది ఆరెంజ్‌, బ్లాక్‌, నియాన్‌, బ్లూ, గ్రీన్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. భార‌త్‌లోనూ దీన్ని త్వ‌ర‌లో లాంచ్ చేయాల‌ని కంపెనీ భావిస్తోంది. త్వ‌ర‌లో భార‌త్‌లో విడుద‌ల చేయ‌నున్న షావోమీ 12 సిరీస్ మొబైల్‌ తో పాటుగా ఈ బ్యాండ్‌ను కూడా కంపెనీ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో Mi Smart Band 7.. లాంచ్ ఎప్పుడంటే!

ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న‌ Mi Smart Band 6 వివ‌రాలు:
షావోమీ సంస్థ‌కు చెందిన Mi Smart Band 6 భార‌త్‌లో గ‌తేడాది ఆగస్టులో లాంచ్ అయింది. ఇది 1.56 అంగుళాల ట‌చ్ డిస్‌ప్లే (152 x 486 pixels)కలిగి ఉంది. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 హెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. ఇది 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, 326ppi పిక్సెల్ డెన్సిటీ క‌లిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిట‌రింగ్, స్లీప్ బ్రీత్ మానిట‌రింగ్‌ ఫీచ‌ర్‌ను కూడా ఈ బ్యాండ్ క‌లిగి ఉంది. ఇది కూడా ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 14 రోజుల పాటు బ్యాట‌రీ లైఫ్ ఇస్తుంది. ఇది 5ATM వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్ ను క‌లిగి ఉంది. ఇన్‌బుల్ట్ సెన్సార్‌లను వినియోగించుకొని ఇండోర్ ట్రైనింగ్, ప్రొఫెషల్ స్పోర్ట్స్‌ సహా మొత్తంగా 30 వర్కౌవుట్ టైప్స్‌ను ఈ బ్యాండ్ ట్రాక్ చేయగలదు.

Best Mobiles in India

English summary
Mi Smart Band 7 With 14 Days of Battery Life

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X