Home
Gadgets

గూగుల్ సర్టిఫికేషన్‌తో మైక్రోమాక్స్ ఆండ్రాయిడ్ టీవీ

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ తన మొట్టమొదటి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టీవీ మొత్తం రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మైక్రోమాక్స్ తన మొట్టమొదటి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టీవీ మొత్తం రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 49 ఇంచ్ స్ర్కీన్‌తో, రెండవ వేరియంట్ వచ్చేసరికి 55 ఇంచ్ స్ర్కీన్‌తో అందుబాటులో ఉంటుంది. 49 ఇంచ్ మోడల్ ధర రూ.51,990. 55 ఇంచ్ మోడల్ ధర రూ.61,990. నవంబర్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది.

అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో లభ్యం..

అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో లభ్యం..

దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ టీవీ అందుబాటులో ఉంటుంది. గూగుల్ సంస్థచే సర్టిఫై చేయబడిన ఈ ఆండ్రాయిడ్ టీవీ స్టాక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై టీవీ రన్ అవుతుంది. ప్లేస్టోర్, గేమ్స్, మూవీస్ ఇంకా మ్యూజిక్ వంటి గూగుల్ యాప్స్ ఈ టీవీలో ప్రీలోడ్ అయి ఉంటాయి.

 

 

4కే యూహెచ్‌డి డిస్‌ప్లే, హెచ్‌డిఆర్ 10 సపోర్టు

4కే యూహెచ్‌డి డిస్‌ప్లే, హెచ్‌డిఆర్ 10 సపోర్టు

ఈ రెండు మోడల్స్‌లోనూ 4కే యూహెచ్‌డి డిస్‌ప్లేలను మైక్రోమాక్స్ ఎక్విప్ చేసింది. హై డైనమిక్ రేంజ్ (హెచ్‌డిఆర్) 10 సపోర్టుతో వస్తోన్న ఈ టీవీలలో వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ అత్యుత్తమంగా ఉంటుంది. ఇక హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ స్మార్ట్ టీవీలలో క్వాడ్-కోర్ ఏ53 ప్రాసెసర్‌తో పాటు 2.5జీబి డీడీఆర్3 ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెక్స్‌ను మైక్రోమాక్స్ నిక్షిప్తం చేసింది. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ సపోర్టుతో లోడై ఉన్న ఈ టీవీలలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఎనేబిల్డ్ సెర్చ్ అందుబాటులో ఉంటుంది.

 

 

సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌..

సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌..

ఇక సౌండ్ అవుట్‌పుట్ విషయానికి వచ్చేసరికి ఈ టెలివిజన్ సెట్‌లలో రెండేసి చొప్పున 12 వాట్ స్పీకర్స్ ఎక్విప్ అయి ఉంటాయి. ఇవి సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఈ టీవీలలో లోడ్ చేసిన ప్యూర్ సౌండ్ టెక్నాలజీకి డాల్బీ అండ్ డీటీఎస్ సర్టిఫికేషన్ ఉంది.

 

 

కరెంటును కూడా పొదుపు చేస్తుంది..

కరెంటును కూడా పొదుపు చేస్తుంది..

వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్‌తో వస్తోన్న ఈ రెండు టీవీలలో బ్లుటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ ఫీచర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇకో ఎనర్జీ ఎఫీషియంట్‌తో వస్తోన్న ఈ టీవీ కరెంటును పొదుపుగా వాడుకుంటుంది.

ఆండ్రాయిడ్ కంటెంట్‌ను భారీ క్రిస్టల్ క్లియర్ స్ర్కీన్స్ పై ఆస్వాదించాలనుకునే వారికి ఈ టీవీలు పర్‌ఫెక్టుగా సూట్ అవుతాయని మైక్రోమాక్స్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ రోహాన్ అగర్వాల్ తెలిపారు.

 

Best Mobiles in India

English summary
Micromax Launches Its First Google-Certified Android TVs at Rs 51,990 Onwards.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X