మైక్రోసాఫ్ట్ నుంచి లాంచ్ అయిన అత్యుత్తమ వేరబుల్ ఉత్పత్తుల్లో 'మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 2’ ఒకటి. ఈ ఫిట్నెస్ ట్రాకర్‌కు మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభించినప్పటికి, ఈ లైనప్‌ను అర్థంతరంగా నిలిపివేస్తూ మైక్రోసాఫ్ట్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 3 కూడా మార్కెట్ ముఖం చూడకుండానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లయ్యింది.
తాజాగా విండోస్ సెంట్రల్ అనే వెబ్‌సైట్ మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 3కి సంబంధించి ఓ రివ్యూను తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఈ రివ్యూ ప్రకారం బ్యాండ్ 2 మోడల్‌తో పోలిస్తే బ్యాండ్ 3 భారీ మార్పు చేర్పులను కలిగి ఉంది. ఈ ప్రొడక్టుకు సంబంధించి మూడు ఫోటోలను కూడా ఈ సైట్ రివీల్ చేయటం జరిగింది.
విండోస్ సెంట్రల్ పోస్ట్ చేసిన రివ్యూ ప్రకారం మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 3, బ్యాండ్ 2 మోడల్‌లతో పోలిస్తే కంఫర్టబుల్ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ట్రాకర్‌కు సంబంధించి స్లిమ్మర్ క్లాస్ప్ అలానే యాక్షన్ బటన్‌లు బ్లాక్ కలర్‌లో కోట్ అయి ఉండవు.
పెర్ఫామెన్స్ పరంగా మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 3 భారీ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ ఫిట్నెస్ ట్రాకర్ పూర్తి చార్జ్ అవటానికి గంట సమయం మాత్రమే తీసుకుంటుంది. ఇదే సమయంలో బ్యాండ్ 2 పూర్తిగా చార్జ్ అవటానికి గంటన్నర సమయం తీసుకునేది.
చాట్ బోట్స్ ఎలా మారబోతున్నాయ్?
ఇక వాటర్ రెసిస్టెంట్ క్వాలిటీస్ విషయానికి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 3 పూర్తిస్థాయి వాటర్ ప్రూఫింగ్ క్వాలిటీస్‌తో వస్తోంది. ఈ బ్యాండ్‌లో RFID, Electrocardiogram వంటి రెండు ప్రత్యేకమైన సెన్సార్లు ఉంటాయి.
వీటితో పాటు స్విమ్మింగ్ ఎక్సర్‌సైజ్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఈ బ్యాండ్‌లో అందుబాటులో ఉంటుంది. కర్వుడ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్‌లతో పెయిర్ చేసుకునేందుకుగాను బ్లుటూత్ 4.0 ఎల్ఈ వంటి ప్రత్యేకతలు ఈ ట్రాకర్‌లో ఉన్నాయి.
Image Source- www.windowscentral.com
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.