Home
Gadgets

మైక్రోసాఫ్ట్‌ నుంచి AI ఫీచర్‌లతో రెండు ల్యాప్‌టాప్‌లు .. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..!

విండోస్‌ AI ఈవెంట్‌లో ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్‌ కోపైలెట్‌+ పీసీల పేరుతో సర్ఫేస్‌ ప్రో 11 మరియు సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7 పీసీ (పర్సనల్‌ కంప్యూటర్‌) ను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లతో పనిచేయనున్నాయి.

మైక్రో సర్ఫేస్‌ ప్రో 11 స్పెసిఫికేషన్లు :
మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో 11.. 2 ఇన్‌ 1 పీసీ.. 13 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. LCD మరియు OLED డిస్‌ప్లే ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ X ప్రో మరియు Elite చిప్‌సెట్‌లను కలిగి ఉంటుంది. గత మోడల్‌ కంటే 90 శాతం వేగంగా పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది.

Microsoft surface pro 11 and surface laptop 7 launched

సర్ఫేస్‌ ప్రో 11 ల్యాప్‌టాప్‌ గరిష్ఠంగా 32GB LPDDR5X ర్యామ్‌ మరియు 1TB వరకు అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ డివైజ్‌ 114 డిగ్రీల అల్ట్రావైడ్‌, 1440P సెన్సార్‌తో కూడిన వెబ్‌క్యామ్ ను కలిగి ఉంటుంది. ఈ వెబ్‌క్యా్‌మ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత విండోస్‌ స్టూడియో ఎఫెక్ట్‌ సపోర్టు చేస్తుంది.

ఈ పర్సనల్‌ కంప్యూటర్‌లో (PC) స్పేస్‌ బార్‌ పక్కనే కోపైలెట్‌ కోసం ప్రత్యేక బటన్‌ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ మరో ప్రత్యేక కూడా ఉంది. కోబోర్డును, డిస్‌ప్లేను వేరు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సర్ఫేస్‌ ప్రో 11 ల్యాప్‌టాప్‌ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

Microsoft surface pro 11 and surface laptop 7 launched

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7 స్పెసిఫికేషన్‌లు :
సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7 రెండు డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులో ఉంటుంది. 13.5 అంగుళాల మరియు 15 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. ఈ రెండు కూడా IPS LCD ప్యానల్‌లను కలిగి ఉంటుంది. టచ్‌ సపోర్టు సహా డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 ను కలిగి ఉంటుంది.

HDR సపోర్టు, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, డాల్బీ విజన్‌ IQ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7.. స్నాప్‌ డ్రాగన్‌ X ప్లస్‌ మరియు Elite చిప్‌సెట్‌లను కలిగి ఉంటుంది. 64GB LPDDR5X ర్యామ్‌ మరియు 1TB జన్‌ 4 SSD ఇన్‌బిల్ట్‌ స్టోరేజీని కలిగి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో 11 మరియు సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7 ధర :
మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో 11 పీసీ 16GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ X ప్లస్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు LCD డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ వేరియంట్ ధర $999 (భారత కరెన్సీ ప్రకారం రూ.83000) గా ఉంది.

అదే మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7.. 13.88 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్‌ X ప్లస్‌ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్ మరియు 256GB SSD అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర $999 (భారత కరెన్సీ ప్రకారం రూ.83,000) గా ఉంది.

మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ ప్రో 11 మరియు సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 7 సేల్‌ :
ఈ రెండు పీసీలు బ్లాక్‌, డూన్‌, ప్లాటినం, sapphire రంగుల్లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లను ప్రస్తుతం ముందస్తు బుకింగ్‌ చేసుకొనే సదుపాయం ఉంది. జూన్‌ 18 నుంచి సేల్‌ నిర్వహించనున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Microsoft surface pro 11 and surface laptop 7 launched with artificial intelligence features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X