మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ స్టూడియో కొత్త ల్యాప్‌టాప్ లాంచ్ అయింది!! వీటి ప్రత్యేకతలు ఇవే...
మైక్రోసాఫ్ట్ సంస్థ గతేడాది సెప్టెంబర్‌లో సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియోను ఆవిష్కరించింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత కంపెనీ తన సర్ఫేస్ బుక్ యొక్క అప్ గ్రేడ్ ను ఇండియాలో అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా ప్రారంభించబడిన సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో భారతదేశంలో అధీకృత రిటైల్ మరియు ఆన్‌లైన్ భాగస్వాముల ద్వారా ప్రీ-ఆర్డర్‌ల కోసం ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ ప్రకటించింది. ఇది భారతదేశంలో మార్చి 8 నుండి ఎంపిక చేసిన రిటైల్ మరియు ఆన్‌లైన్ భాగస్వాముల ద్వారా మొదటిసారి విక్రయించబడుతుంది. ఫిబ్రవరి 15 మరియు మార్చి 7 మధ్య ప్రీ-ఆర్డర్ వ్యవధిలో కొత్తగా లాంచ్ చేసిన ల్యాప్‌టాప్‌ను బుక్ చేసుకున్న కస్టమర్‌లు రూ.11,399 విలువైన స్లిమ్ పెన్ 2 స్టైలస్‌ను ఉచితంగా పొందుతారని కంపెనీ తెలిపింది. దీని యొక్క ఫీచర్స్ మరియు ధరలు వంటి పూర్తి సమాచారం గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ధరల వివరాలు
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలో కొత్తగా లాంచ్ చేసిన సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో యొక్క ధరల విషయానికి వస్తే ఇది రూ.1,56,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది మొత్తం ఏడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఐదు మోడల్‌లు ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 SoC, 16GB RAM మరియు 256GB స్టోరేజ్ స్పేస్ ఉన్న వేరియంట్ ఎంటర్‌ప్రైజెస్ యొక్క ధర రూ.1,56,999 కాగా కస్టమర్‌ల ధర రూ.1,65,999. అలాగే 11వ-జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 SoC, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ స్పెసిఫికేషన్స్ కలిగిన వేరియంట్ యొక్క ధర ఎంటర్‌ప్రైజెస్ కోసం రూ.2,01,399 కాగా కస్టమర్‌లకు రూ.2,15,999 ధర వద్ద లభిస్తుంది.

** 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 SoC, 16GB RAM మరియు 512GB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.1,74,699.
** 11వ-తరం ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 1TB స్టోరేజ్ స్పేస్ ఉన్న వేరియంట్ ధర రూ.2,54,699.
** 11వ తరం ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 1TB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ. 3,07,999
** 11వ-తరం ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 2TB క్వాడ్రో స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.3,43,499.
** 11వ తరం ఇంటెల్ కోర్ i7 SoC, 32GB RAM మరియు 2TB స్టోరేజ్ స్పేస్‌తో కూడిన వేరియంట్ ధర రూ.2,90,999.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో స్పెసిఫికేషన్స్
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 14.4-అంగుళాల పిక్సెల్‌సెన్స్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను 2,400×1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 10-పాయింట్ మల్టీ-టచ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 32GB వరకు LPDDR4x RAM మరియు 2TB వరకు SSD స్టోరేజ్ తో జతచేయబడి క్వాడ్-కోర్ 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇంటెల్ కోర్ i5 SoCతో కూడిన మోడల్‌లు ఇంటెల్ ఐరిస్ Xe ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్‌లను కలిగి ఉండగా ఇంటెల్ కోర్ i7 SoC ఉన్నవి Nvidia GeForce RTX 3050 Ti అంకితమైన GPUను కలిగి ఉంటాయి. ఇది మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్11 OSతో రన్ అవుతుంది.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో ఆడియో విభాగానికి వస్తే ముందు భాగంలో క్వాడ్ ఓమ్నిసోనిక్ స్పీకర్లు, డ్యూయల్ ఫార్-ఫీల్డ్ స్టూడియో మైక్‌లు మరియు డాల్బీ అట్మోస్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే ముందు భాగంలో 1080 పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌లతో కూడిన మోడల్‌లు 19 గంటల జీవితాన్ని అందించడానికి ఇది 65W సర్ఫేస్ పవర్ సప్లై అడాప్టర్‌తో వస్తాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మరోవైపు Intel Core i7 SoCతో ఉన్న మోడల్‌లు గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందజేస్తాయని మరియు అవి 102W సర్ఫేస్ పవర్ సప్లై అడాప్టర్‌తో వస్తాయి. కనెక్టివిటీ ఎంపికలలో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ స్టూడియో రెండు USB టైప్-C పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సర్ఫేస్ కనెక్ట్ పోర్ట్, Wi-Fi 6 మరియు బ్లూటూత్ వెర్షన్ 5.1ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications