Home
Gadgets

60 గంటల బ్యాటరీ లైఫ్‌తో Mivi TWS ఇయర్‌బడ్స్‌.. ప్రత్యేక డిజైన్‌ సహా సూపర్‌ ఫీచర్‌లు..!

ప్రస్తుతం ఆడియా ఉత్పత్తులు ఇయర్‌బడ్స్‌, సౌండ్‌బార్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. ఫలితంగా తయారీ సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వైర్‌ ఇయర్‌ఫోన్స్‌, ఇయర్‌బడ్స్‌, నెక్‌బ్యాంక్‌, TWS బడ్స్‌ వంటి మోడళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌ లో అనేక బ్రాండ్‌లు ఆడియో ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి.

ప్రముఖ దేశీయ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ Mivi తాజాగా TWS ఇయర్‌బడ్స్‌ ను విడుదల చేసింది. మివీ సూపర్‌పాడ్స్‌ కాన్సెర్టో బడ్స్‌ (Mivi SuperPods Concerto TWS Earbuds) పేరుతో లాంచ్ చేసింది. ఈ బడ్స్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు డిజైన్‌ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి ఏకంగా 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ అందిస్తుందని సంస్థ చెబుతోంది.

Mivi SuperPods Concerto TWS Earbuds launched

ఆకట్టుకొనే డిజైన్‌ :
ఈ మివి ఇయర్‌బడ్స్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బడ్స్‌ హవర్‌గ్లాస్ స్టెమ్‌, గ్లోసీ ఫినిష్‌ తో కూడిన మెటల్‌ యూనిబాడీ డిజైన్‌ ను కలిగి ఉంది. డిజైన్‌తోపాటు అనేక మెరుగైన ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌ మరియు డాల్బీ ఆడియో టెక్నాలజీ సపోర్టును కలిగి ఉంది.

ANC ఫీచర్‌, కాల్ నాయిస్‌ రిడక్షన్‌ :
ఈ బడ్స్‌ 3D సౌండ్‌స్టేజ్‌ సౌండ్‌ ప్రొఫైల్‌ టెక్నాలజీ ను కూడా సపోర్టు చేస్తుంది. వీటి కారణంగా మివి బడ్స్‌ అత్యంత అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని సంస్థ చెబుతోంది. ఈ బడ్స్‌ 35dB ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) ఫీచర్‌ ను కలిగి ఉంది. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ మరియు కాల్ నాయిస్‌ రిడక్షన్‌ ఫీచర్‌ లను కలిగి ఉంది.

బ్లూటూత్‌, క్వాడ్‌ మైక్‌ :
కనెక్టివిటీ పరంగా ఈ ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.4 తో పనిచేస్తుంది. మరియు LDAC ఆడియో కోడిక్‌ ను సపోర్టు చేస్తుంది. డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. ఈ Mivi బడ్స్‌ క్వాడ్‌ మైక్‌ యూనిట్‌ ను కలిగి ఉంది.

60 గంటల బ్యాటరీ లైఫ్ :
బ్యాటరీ లైఫ్‌ పరంగా ఈ మివి బడ్స్‌ మెరుగ్గా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఇయర్‌బడ్స్‌ ను 8 గంటల వరకు వినియోగించుకోవచ్చు. అయితే ఛార్జింగ్‌ కేస్‌ తో కలిపి 60 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ బడ్స్‌ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ తో ఏకంగా ఎనిమిది గంటల ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు.

మివీ సూపర్‌పాడ్స్‌ కాన్సెర్టో బడ్స్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ మివి ఇయర్‌బడ్స్‌ (Mivi Earbuds Sale) ధర రూ.3,999 గా ఉంది. ఈ బడ్స్‌ను మివి ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లతో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఈ TWS బడ్స్‌ స్పేస్‌ బ్లాక్, మిస్టిక్ సిల్వర్‌, మెటాలిక్ బ్లూ, రాయల్‌ షాంపైన్‌ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Mivi SuperPods Concerto TWS Earbuds launched with 60 hours of battery life in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X