మీ ఫోన్ కిందపడినా,బండకేసి కొట్టినా చెక్కు చెదరదు, సూపర్ బ్యాగ్ !

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. అన్ని పనులు స్మార్ట్‌ఫోన్ ద్వారానే చకచకా జరిగిపోతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది అన్ని ఫీచర్లు ఉన్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కడువ ఆసక్తి చూపిస్తున్నారు. కొంచెం ఖర్చు ఎక్కువైనా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత ఖరీదైన ఫోన్లు ఒక్కోసారి చేతుల్లో నుంచి జారిపడి పగిలిపోతుంటాయి. అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే ఈ బాధ నుంచి ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి మార్కెట్లకి త్వరలో ఎయిర్‌ బ్యాగ్‌ రాబోతోంది. దీని ద్వారా మీ ఫోన్ కిందపడినా చెక్కుచెదరదు.

 

మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్లను సవాల్ చేస్తున్న ఫీచర్ ఫోన్లు ఇవే !మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్లను సవాల్ చేస్తున్న ఫీచర్ ఫోన్లు ఇవే !

ఫిలిప్‌ ఫ్రెంజెల్‌..

ఫిలిప్‌ ఫ్రెంజెల్‌..

జర్మనీలోని ఆలేన్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఫిలిప్‌ ఫ్రెంజెల్‌ ఫోన్ కిందపడినా పగిలిపోకుండా ఉండేందుకు ఓ మార్గాన్ని కనిపెట్టాడు. ఈ మార్గమే మొబైల్‌ ఎయిర్‌ బ్యాగ్‌.

ఎయిర్‌ బ్యాగ్‌ మొబైల్‌ ..

ఎయిర్‌ బ్యాగ్‌ మొబైల్‌ ..

కార్లకు ప్రమాదం సంభవించినప్పుడు మనష్యులను రక్షించే ఎయిర్‌ బ్యాగ్‌లానే ఇతను కనిపెట్టిన ఎయిర్‌ బ్యాగ్‌ మొబైల్‌ కింపడినప్పుడు పగిలిపోకుండా రక్షిస్తోంది.

ఆడ్‌కేస్‌ (ADCASE)

ఆడ్‌కేస్‌ (ADCASE)

దీనికి ఆడ్‌కేస్‌ (ADCASE) అని ఓ పేరు కూడా పెట్టాడు. ఈ ప్రయోగానికి అతను అవార్డు కూడా గెలుచుకున్నాడు. జర్మనీలో విద్యార్థుల ప్రాజెక్టులకు అవార్డులు ప్రకటించే జర్మన్‌ సోసైటీ ఫర్‌ మెకాట్రోనిక్సే ఫ్రెంజల్‌కు ఆ అవార్డు అందజేసింది.

మొబైల్‌ ఆకస్మాత్తుగా కిందపడినప్పుడు
 

మొబైల్‌ ఆకస్మాత్తుగా కిందపడినప్పుడు

మొబైల్‌ ప్యానెల్‌గా ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన ఓ డివైజ్‌కు సెన్సార్లను అమర్చి దానికి ఓ ఎయిర్‌ బ్యాగ్‌ అమర్చాడు. మొబైల్‌ ఆకస్మాత్తుగా కిందపడినప్పుడు ఆ డివైజ్‌లోని సెన్సార్లు యాక్టివేట్‌ అయి ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకుంటుంది.

మొబైల్‌, స్క్రీన్‌లను నేలకు తగలకుండా..

మొబైల్‌, స్క్రీన్‌లను నేలకు తగలకుండా..

ఇది మొబైల్‌, స్క్రీన్‌లను నేలకు తగలకుండా కాపాడుతుంది. ఈ డివైజ్‌ తయారు చేయడానికి ఫ్రెంజల్‌ అతని స్నేహితులు గత రెండున్నరేళ్లుగా కష్టపడ్డారు.

అన్ని రకాల ఐఫోన్‌లకు..

అన్ని రకాల ఐఫోన్‌లకు..

అన్ని రకాల ఐఫోన్‌లకు, ఆండ్రాయిడ్ ఫోన్లకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం నిధుల సేకరణ జరుగుతోంది. జూలైలో అందుబాటులోకి తీసుకురావాలని ఫిలిప్ బృందం భావిస్తోంది.

ఐఫోన్‌ పలుమార్లు కింద పడి పగిలిపోవడం వల్ల..

ఐఫోన్‌ పలుమార్లు కింద పడి పగిలిపోవడం వల్ల..

తన ఐఫోన్‌ పలుమార్లు కింద పడి పగిలిపోవడం వల్ల చిరాకుతోనే దీనికి మార్గం కనిపెట్టానని విద్యార్థి ఫిలిప్‌ ఫ్రెంజెల్‌ చెబుతున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే ఇక మీ ఫోన్ నేలకేసి విసిరికొట్టినా ఏం కాదన్న మాట.

దీనికి సంబంధించిన వీడియో ఇదే..

దీనికి సంబంధించిన వీడియో ఇదే..

source: Landesschau Baden-Württemberg

Best Mobiles in India

English summary
Genius Student Invents “Mobile Airbag” That Deploys When You Drop Your Phone, Tries It With His Phone More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X