2016లో.. షాకిచ్చిన టెక్నాలజీ ఫెయిల్స్

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో టెక్నాలజీ లేకుండా జీవించటమనేది ఓ పెద్ద సవాల్‌గా మారిపోయింది. నగరాల దగ్దర నుంచి మూరుమూల పల్లెల వరకు టెక్నాలజీ పై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్లో పుట్టుకొస్తూనే ఉంది.

2016లో.. షాకిచ్చిన టెక్నాలజీ ఫెయిల్స్

2016లో చోటు చేసుకున్న సాంకేతిన ఆవిష్కరణలు ఆయా కంపెనీలకు లాభం కన్నా నష్టాన్నే ఎక్కువుగా మిగిల్చినట్లు స్సష్టమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది టెక్నాలజీ రంగంలో చేదు అనుభవాలనే మిగిల్చింది. 2016 సంవత్సరంలో ఫెయిల్ అయిన టాప్ టెక్నాలజీల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యుర్

2016కు గాను సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాలతో మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ లోపం కారణంగా పూర్తి ఫెయిల్ అయ్యింది అమ్మిన ఫోన్‌లన్నీ వెనక్కి వచ్చేయటతో వేల కోట్ల నష్టాన్ని సామ్‌సంగ్ చవిచూడాల్సి వచ్చింది. చివరాకరకు గెలాక్సీ నోట్ 7ను సామ్‌సంగ్ పూర్తిగా నిలిపివేసింది.

కర్మ డ్రోన్ ఫెయిల్యుర్...

ఆకాశంలోనుంచి అదిరిపోయో ఫోటోలను తీస్తామంటూ ముందుకు దూసుకువచ్చిన కర్మ డ్రోన్ అభిమానులకు చేదు జ్ఙాపకాలనే మిగిల్చింది. ఆకాశంలోకి వెళ్లగానే ఇవి తమ శక్తిని కోల్పోయి నేల పై కూలటం మొదలుపెట్టాయి. కంపెనీ వీటిని రీకాల్ చేస్తున్నామంటూ
ప్రకటించింది.

హెడ్‌ఫోన్ జాక్‌

హెడ్‌ఫోన్ జాక్‌తో అవసరం లేకుండానే మ్యూజిక్‌ను  వినడంటూ యాపిల్ కంపెనీ సరికత్త  హెడ్ జాక్‌లను తన ఐఫోన్7తో పాటుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇవి మార్కెట్లో నిరాశనే మిగిల్చాయి. చిన్న డొంగెల్ లాంటి పరికరం లేకుండా అవి రన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో అవి వినియోగదారులను మెప్పించలేకపోయాయి.

చాట్ బోట్స్

ఫేస్‌బుక్ తన మెసేంజర్‌లో చాట్ బోట్స్ అంటూ ఓ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. కష్టమర్లు త్వరగా తమ సర్వీసును అందుకోడానికి ఇది బెస్ట్ అంటూ చెప్పింది కూడా. అయితే ఇది కష్టమర్లకు మదికి చాలా దూరంలో నిలిచింది.

గూగుల్ హోమ్

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, Google Home పేరుతో వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్ పవర్‌తో కూడిన గూగుల్ అసిస్టెంట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫీచర్ చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేక మార్కెట్లో చతికిలబడింది.

ఫ్రీడం 251

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ దూసుకొచ్చిన రింగింగ్ బెల్స్ కంపెనీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచదేశాలకు సైతం దిమ్మతిరిగేలా చేసిన రింగింగ్ బెల్స్ మేక్ ఇన్ ఇండియా ఫోన్ అంటూ ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. రూ. 251కే ఫోనంటూ జనాలను నమ్మించిన రింగింగ్ బెల్స్ సంస్థ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా డెలివరీ చేయలేదు. దీంతో
రింగింగ్ బెల్స్ తీరు 2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్'గా మిగిలిపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Embarrassing Tech Fails of 2016. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot