లిల్లీ డ్రోన్‌ను రీలాంచ్ చేస్తున్న మోటా గ్రూప్!

By: Madhavi Lagishetty

మోటా గ్రూప్ నుంచి లిల్లీ డ్రోన్ త్వరలోనే వినియోగదారులకు చేరువకానుంది. లిల్లీ అనే బ్రాండ్ నేమ్ తో మోటా గ్రూప్, ఈ ప్రొడక్ట్ ను రీలాంచింగ్ చేస్తోంది. నెక్ట్స్ వెర్షన్ ను కాస్త ఛేంజ్ చేశారు. అంతేకానీ దానిని మార్కెట్లోకి ఇంకా మార్చలేదు.

 లిల్లీ డ్రోన్‌ను రీలాంచ్ చేస్తున్న మోటా గ్రూప్!

ప్రొడక్ట్ తర్వాతి లైన్ లో వినియోగదారులు స్మార్ట్ ఫోన్లో కనెక్ట్ అనే యాప్ తో ఒక టచ్ ఉపయోగిస్తే.. డ్రోన్ అప్ లిఫ్ట్ ను అనుమతిస్తుంది. నెక్ట్స్ వెర్షన్ కు, ఈ డ్రోన్ వినియోగదారులకు అటోనామస్ ట్రాకింగ్ ఫీచర్ను కూడా ఇస్తోంది.

ఈ డ్రోన్ పాకెట్స్ లో సరిపోయేంత చిన్న ట్రాకింగ్ డివైస్ ను కలిగి ఉంటుంది. వినియోగదారునికి ఆటోమెటిక్ గ్గా, ట్రాకింగ్ చేయడం ద్వారా 4K వీడియోలను రికార్డు చేయడానికి అనుమతిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా లిల్లీ డ్రోన్ అంత్యంత యాంటిస్పెటెడ్ కెమెరా డ్రోన్స్ లో ఒకటి. మే, 2015లో, లిల్లీ డ్రోన్ మేకర్స్ యూట్యూబ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వాళ్లు తయారు చేసిన డ్రోన్ను పరిచయం చేస్తూ తీసింది. ఈ వీడియో ఫీచర్స్ యూట్యూబ్ లో వైరల్ గా మారాయి.

మీ ఫోన్‌కి హార్ట్ ఈ చిన్న రంధ్రమే, దీని ఉపయోగాలు తెలుసుకోండి

ఈ ఏడాది ప్రారంభంలో లిల్లీ డ్రోన్ క్యాన్సల్ చేశారు. అయితే ముందస్తు బుకింగ్ కోసం తీసుకున్న 30 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మేకర్స్ ప్రామిస్ చేశారు. అయితే డబ్బు తిరిగి చెల్లించే ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది.

ఫెయిల్ అయిన ప్రొడక్ట్ తర్వాత ఇప్పుడు కొత్త వెర్షన్ తయారీలో ఉంది. అయితే డివైస్ ఇప్పటికీ ఖచ్చితంగా రిలీజ్ చేయలేదు. డ్రోన్ ని గాలిలో విసిరినప్పుడు ఆటోమేటిక్ టేక్ ఆఫ్ ఫీచర్ ఉండదు అనే వాస్తవం ఖచ్చితమైనది కాదు.

లిల్లీ మేకర్స్ మొత్తం 45 మిలియన్ డాలర్ల ఫండ్స్ సమకూర్చారు. ప్రామిస్ చేసిన ఒక వారంలోనే ఈ ప్రొడక్ట్ ను క్యాన్సల్ చేశారు. తర్వాత వెర్షన్ ను వినియోగదారులు ఆదరిస్తే.. ఈ బ్రాండ్ పేరు గుర్తుండే అవకాశాలు ఉన్నాయి.

ఈ డ్రోన్ 699డాలర్ల వద్ద రిటైల్ అవుతుంది. గిజ్మో ను ప్రీ –బుక్ చేసిన వినియోగదారులకు ఇది 499డాలర్లకు లభిస్తుంది.

Read more about:
English summary
Mota Group which acquired the brand name Lily is ready to ship the next version of Lily drone for $699.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot