42 గంటల బ్యాటరీ లైఫ్‌తో Moto Buds విడుదల.. ఈ బ్యాంకు కార్డులపై రూ.1000 తగ్గింపు..!!
మోటో సంస్థ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను (Moto Earbuds in India) విడుదల చేసింది. భారత్ మార్కెట్‌లో ఇవాళ మోటో బడ్స్ మరియు మోటో బడ్స్ ప్లస్ విడుదల అయ్యాయి. ఈ ఇయర్‌ఫోన్ డైనమిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు ట్రిపుల్ మైక్ మరియు మెరుగైన ఆడియో క్వాలిటీతో లాంచ్ అయ్యాయి.
మోటో బడ్స్ స్పెసిఫికేషన్లు :
మోటో బడ్స్ సింగిల్ 12.4mm డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉన్నాయి. 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టుతో వస్తుంది. ANC ఆఫ్ మోడ్‌లో.. 42 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఈ బడ్స్ 9 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంటాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటలపాటు వినియోగించుకోవచ్చు. బడ్స్, ఛార్జింగ్ కేస్ బరువు 36గ్రాములు ఉంటుంది.

మోటో బడ్స్ ప్లస్ స్పెసిఫికేషన్లు :
మోటో బడ్స్ ప్లస్ ఇయర్‌బడ్స్ (Moto Buds Plus) డ్యూయల్ డైనమిక్ డ్రైవర్‌లతోపాటు 11mm ఊఫర్ మరియు 6mm ట్వీకర్‌లను కలిగి ఉంటుంది. 46dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టుతో వచ్చింది. ఈ ఇయర్‌బడ్స్ డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. తల కదలికలు (హెడ్ మూమెంట్) ఆధారంగా ఆడియోను సర్దుబాటు చేస్తుంది.
దీంతోపాటు డాల్బీ ఆట్మాస్ సపోర్టును కలిగి ఉంది. ప్లస్ మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 38 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. 8 గంటలపాటు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ మోటో బడ్స్ ప్లస్ ఇయర్‌బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటల ప్లేబ్యాక్ సమయాన్ని పొందవచ్చు.

మోటో బడ్స్ మరియు బడ్స్ ప్లస్ ఇయర్‌బడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్‌లో మూడు రకాల మోడ్‌లను కలిగి ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ, అడాప్టివ్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్టుతో ట్రిపుల్ మైక్‌లో లాంచ్ అయింది. ఫలితంగా కాల్ నాణ్యతను కలిగి ఉంటుంది.
ఈ రెండు ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ USB-C సపోర్టు చేస్తుంది. అయితే బడ్స్ ప్లస్ మోడల్ మాత్రమే వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. బడ్స్, బడ్స్ ప్లస్ ఛార్జింగ్ కేస్‌లు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. బ్లూటూత్ 5.3 తో పనిచేస్తుంది. మోడ్ బడ్స్ ప్లస్ ఇయర్‌బడ్స్ మరియు ఛార్జింగ్ కేస్ బరువు 42.8 గ్రాములు ఉంటుంది.
మోటో బడ్స్ ఇయర్‌బడ్స్ ధర..
మోటో బడ్స్ ఇయర్‌బడ్స్ ధర రూ.4999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.3999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్స్ మూడు రంగుల్లో లభించనున్నాయి. కోరల్ పీచ్, గ్లేసియర్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. కివీ గ్రీన్ కలర్ వేరియంట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
బడ్స్ ప్లస్ ఇయర్ బడ్స్ ధర..
మోటో బడ్స్ ప్లస్ ఇయర్ బడ్స్ ధర రూ.9999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.7999 కే సొంతం చేసుకోవచ్చు. బీచ్ శాండ్ మరియు ఫారెస్ట్ గ్రే రంగుల్లో ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది. మే 15 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








