రూ.1999 ధరకే బడ్స్.. ANC, ENC సహా సూపర్ ఫీచర్లు.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ మోటోరోలా తాజాగా మోటో బడ్స్ లూప్, మోటో బడ్స్ బాస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ రెండు ఇయర్‌బడ్స్ అనేక స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. బ్యాగ్రౌండ్ నాయిస్‌ను తగ్గించేందుకు వీలుగా ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. వచ్చే నెల నుంచి ఈ రెండు బడ్స్ సేల్ ప్రారంభం కానున్నాయి.
మోటో బడ్స్ బాస్ ఇయర్‌బడ్స్ :
ఈ బడ్స్ (Moto Buds Bass Earbuds) Hi-Res LDAC ఆడియో కోడిక్ సపోర్టుతో 12.4mm కంపోజిట్ డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉంది. ఈ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటి సపోర్టును కలిగి ఉన్నాయి. ఈ బడ్స్ స్పేషియల్ ఆడియోను సపోర్టు చేస్తాయి.

ఈ బడ్స్ ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు 50dB ANC సపోర్టును కూడా కలిగి ఉంది. లో లేటెన్సీ సపోర్టు కూడా ఉంది. ఇయర్‌బడ్స్‌లో ప్రతి బడ్ మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంది. ఈ బడ్స్ క్రిస్టల్‌టాక్ AI, ENC, యాంటీ విండ్ నాయిస్ రిడక్షన్ సపోర్టును కలిగి ఉంది. ఇవి బ్యాగ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి కాల్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఏకంగా 48 గంటల బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని మోటో చెబుతోంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

మోటో బడ్స్ లూప్ ఇయర్‌బడ్స్ :
ఈ బడ్స్ (Moto Buds Loop Earbuds) బాస్ ట్యూనింగ్‌తో 12mm డ్రైవర్లను కలిగి ఉంది. 3D తరహా ఆడియో అనుభూతి కోసం స్పేషియల్ సౌండ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ బడ్స్ బ్లూటూత్ 5.4, డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. మోటో ఏఐ, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి.
ఈ బడ్స్ వాయిస్ పిక్‌అప్ సెన్సర్‌లు, క్రిస్టల్‌టాక్ AI తో కూడిన డ్యూయల్ మైక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఏఐ టూల్, సెన్సర్‌లు బ్యాగ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి కాల్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి.
ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 39 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను పొందవచ్చని మోటో చెబుతోంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.

మోటో బడ్స్ ధర, సేల్ వివరాలు :
అదే మోటో బడ్స్ బాస్ ధర రూ.1999 గా ఉంది. సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి ఈ బడ్స్ సేల్ ప్రారంభం కానుంది. బ్లూ జ్యూవెల్, డార్క్ షాడో, పోసే గ్రీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
మోటో బడ్స్ లూప్ ప్రారంభ ధర రూ.7999 గా ఉంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ బడ్స్ సేల్ ప్రారంభం కానుంది. ట్రెక్కింగ్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ బడ్స్‌ను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








