13 రోజుల బ్యాటరీ లైఫ్‌తో స్మార్ట్‌వాచ్.. సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే?
Moto Watch Sale : ప్రముఖ సంస్థ మోటోరోలా భారత్ మార్కెట్‌లో జనవరి 23 వ తేదీన మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్, మోటో వాచ్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రీమియం ధర సెగ్మెంట్‌లో లాంచ్ చేసింది. ముంబయిలో నిర్వహించిన ఈవెంట్‌లో వీటిని విడుదల చేసింది. ఈ మోటో వాచ్ అనేక హెల్త్ మరియు ఫిట్‌నెస్ ట్రాకర్లను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.
మోటో వాచ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ వాచ్ రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. 1.4 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 1 ATM వరకు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని మోటో తెలిపింది.

సెన్సర్‌లు :
ఈ స్మార్ట్‌వాచ్ 4GB eMMC స్టోరేజీని కలిగి ఉంది. ఈ వాచ్ ఆండ్రాయిడ్ 12 OS లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ వాచ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని సపోర్టు చేస్తుంది. ఈ మోటో వాచ్ ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, PPG సెన్సర్, SpO2 సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్‌లు ఉన్నాయి.
ట్రాకర్‌లు :
ఈ వాచ్ అనేక హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో బ్లడ్ ఆక్సీజన్ స్థాయిలను పర్యవేక్షించే ఫీచర్, హైడ్రేషన్ రిమైండర్, హార్ట్ రేజ్ మానిటర్, నడనకు సంబంధించిన ఫీచర్, కేలరీల ఖర్చును పర్యవేక్షించే ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు నిద్ర నాణ్యతను తెలిపే స్కోర్‌ను అందిస్తుంది.

13 రోజుల బ్యాటరీ లైఫ్ :
ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే, 13 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని మోటోరోలా చెబుతోంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో ఒక్కరోజుపాటు వినియోగించుకోవచ్చని చెబుతోంది.
మోటో వాచ్ ధర, సేల్ వివరాలు :
మోటో వాచ్ సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.5999 గా ఉంది. అదే మెటల్, లెదర్ స్ట్రాప్ వేరియంట్స్ ధర రూ.6999 గా ఉంది. ఈ వాచ్ జనవరి 30 నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
సిలికాన్ స్ట్రాప్ మోడల్ పాంటోన్ హెర్బల్ గార్డెన్, పాంటోన్ వాల్కనిక్ యాష్, పాంటోన్ పారచుట్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. లెదర్ స్ట్రాప్ పాంటోన్ మోచా మౌసీ, స్టెయిన్‌లెస్ స్టీల్ మోడల్ మ్యాటీ బ్లాక్, మ్యాటీ సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మోటోరోలా సిగ్నేచర్ :
మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల సూపర్ HD LTPO ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90W వైర్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత మోటోరోలా Hello UI పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP OIS, 50MP అల్ట్రావైడ్ మరియు 3x ఆప్టికల్ జూమ్, 100x హైబ్రిడ్ జూమ్, OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP సెల్ఫీ కెమెరా ఉంది.


Click it and Unblock the Notifications








