ఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండి
మీరు మోటో జడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోన్‌తో మీరు తీసుకున్న ఫోటోలను స్టూడియోకి వెళ్లకుండానే ప్రింట్లు తీసుకోవచ్చు.
మీరు మోటో జడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఆ ఫోన్‌తో మీరు తీసుకున్న ఫోటోలను స్టూడియోకి వెళ్లకుండానే ప్రింట్లు తీసుకోవచ్చు. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లకు మీరు రకరకాల మోడ్ లు తగిలించి వాటిని వైవిధ్యంగా వాడుకోవచ్చు. ఈ ఫోన్లకు కెమెరాకి సంబంధించినవి, అలాగే స్పీకర్ కి సంబంధించినవి తగిలించుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఈ ఫోన్లోని కెమెరాకు తగిలించుకునే విధంగా ప్రింటర్ అందుబాటులోకి వచ్చింది.

పోలరాయిడ్ ఇన్‌స్టా షేర్ ప్రింటర్
పోలరాయిడ్ ఇన్‌స్టా షేర్ ప్రింటర్ గా పిలిచే దీన్ని థర్డ్ పార్టీ ఆప్ సాయంతో మీ మొబైల్‌కు కనెక్ట్ చేయాలి.

2×3 అంగుళాల ఫొటో ప్రింట్లు
ఆ తర్వాత మొబైల్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోలతోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ పొటోస్ ఆప్‌లోని ఫొటోలను 2×3 అంగుళాల ఫొటో ప్రింట్లు తీసుకోవచ్చు.

500 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీంతో 20 ఫొటోలు ప్రింట్ తీసుకోవచ్చు.

ధర సుమారు రూ. 13వేలు
దీని ధర సుమారు రూ. 13వేలు.బరువు 188 గ్రాములు. ఇవి ఇంకా ఇండియాకి రాలేదు...అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








