Home
Gadgets

Motorola నుంచి కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు!! త్వరలోనే లాంచ్...

మోటరోలా సంస్థ ఇండియాలో త్వరలో కొత్తగా రెండు స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేయడం ద్వారా గాడ్జెట్స్ విభాగంలోకి తిరిగి ప్రవేశించనుంది. మోటో వాచ్, మోటో వాచ్ వన్ మరియు మోటో G వాచ్ పేరులతో పిలువబడే మూడు కొత్తరకం స్మార్ట్‌వాచ్‌లను కంపెనీ ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబందించిన పుకార్లు మరియు లీక్‌లు ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మోటరోలా స్మార్ట్‌వాచ్‌లు ఎలా ఉంటాయో మరియు అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో అనేదాని గురించి ఇటీవల కొన్ని లీక్‌లు వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మోటో G వాచ్

మోటరోలా యొక్క బ్రాండ్ లైసెన్సు (eButNow) యొక్క సేల్ స్క్రీన్ ను కలిగి ఉన్న ట్విట్టర్ యూజర్ ఫెలిపే బెర్హువా ప్రకారం కంపెనీ త్వరలో మోటో వాచ్ మరియు మోటో 360 యొక్క అప్ డేట్ వెర్షన్ మోటో వాచ్ వన్ మరియు మోటో G వాచ్ అని పిలువబడే మూడు మోటరోలా స్మార్ట్‌వాచ్‌లను విడుదల కానున్నట్లు భావిస్తున్నారు. ట్వీట్ యొక్క సమాచారం ప్రకారం స్మార్ట్‌వాచ్‌లలో మోటో వాచ్ ఆపిల్ వాచ్ లాగా కనిపించేలా చదరపు డయల్ ను కలిగి ఉండవచ్చు. ఇది చాలా మందికి డిజైన్ స్ఫూర్తికి మూలంగా మారింది. మోటో వాచ్ వన్ రౌండ్ డయల్ కలిగి ఉండవచ్చు.

మోటో G వాచ్ డిజైన్

మోటో G వాచ్ యొక్క డిజైన్ విషయానికొస్తే ఇది రౌండ్ డయల్‌తో కానీ మెటాలిక్ ఫినిష్‌తో కానీ వస్తుందని భావిస్తున్నారు. ఇతర రెండు మోడల్స్ యొక్క డిజైన్ లలో సిలికాన్ పట్టీలు ఉన్నట్లు అనిపిస్తుంది. ‘G' మోడల్ వాచ్ బడ్జెట్ ధరలో స్మార్ట్‌వాచ్‌లను వెతుకుతున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది అని గట్టి నమ్మకం.

స్మార్ట్‌వాచ్‌లు

ఈ ఏడాది 2021 సంవత్సరంలోనే ఈ స్మార్ట్‌వాచ్‌లు విడుదల అయ్యే అవకాశం అని కూడా సంస్థ వెల్లడించింది. మోటో వాచ్ మరియు మోటో వాచ్ వన్ జూలైలో ప్రారంభించనున్నట్లు మరియు మోటో G మోడల్ వాచ్ జూన్‌లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మోటరోలా యొక్క ఈ స్మార్ట్‌వాచ్‌లను కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా తయారు చేయబడతాయని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌వాచ్‌లు త్వరలోనే భారతదేశానికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా వస్తాయని నమ్మకం. అయితే ఈ డివైస్ ఎటువంటి ఫీచర్లను మరియు స్పెసిఫికేషన్లను కలిగి ఉందొ వంటి వివరాలు ఇంకా తెలియాలసి ఉంది. ఇందులో ఖచ్చితంగా హృదయ స్పందన సెన్సార్, యాక్టివిటీ ట్రాకర్ వంటి మరిన్ని ప్రాథమిక కార్యాచరణలు జోడించబడి ఉంటాయని ఆశించవచ్చు.

Best Mobiles in India

English summary
Motorola Plan to Launch Three New Moto Series Smartwatches Very Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X