Home
Gadgets

తొలిసారిగా మోటోరోలా నుంచి ఇయర్‌బడ్స్‌.. 42 గంటల ప్లేబ్యాక్‌ టైం సహా కీలక ఫీచర్లు..?

మోటోరోలా సంస్థ భారత్‌లో తొలిసారిగా వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను (Motorola Wireless Earbuds) విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి మోటోరోలా ఇండియా ధ్రువీకరించింది. అయితే ఏ మోడల్‌ను మోటోరోలా సంస్థ లాంచ్ చేయనుందో వెల్లడించలేదు. X పోస్ట్‌ ద్వారా ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. సౌండ్‌ ఆఫ్‌ యూత్‌ ట్యాగ్‌లైన్‌ను జతచేసింది.

టీజర్‌ ఆధారంగా ఈ మోటోరోలా ఇయర్‌ఫోన్స్‌.. డార్క్‌ బ్లూ, లైట్‌ బ్లూ, రెడ్‌, యెల్లో రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మెరుగైన వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల కానుందని సమాచారం. అయితే ఇయర్‌బడ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

motorola teases wireless earbuds for indian market

మోటోరోలా సంస్థ ఇటీవల అనేక దేశాల్లో మోటో బడ్స్‌ మరియు మోటో బడ్స్‌ + ను విడుదల చేసింది. భారత్‌ మార్కెట్‌లోనూ వీటినే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే హై ఎండ్‌ మోడల్‌ మోటో బడ్స్‌+ బీచ్‌ శాండ్‌ మరియు ఫారెస్ట్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. అదే మోటో బడ్స్‌ కోరల్ పీచ్‌, గ్లేసియర్‌ బ్లూ, కివీ గ్రీన్‌, స్టార్‌లైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

మోటో బడ్స్‌ మరియు మోటో బడ్స్‌ + స్పెసిఫికేషన్లు :
మోటో బడ్స్‌ మరియు బడ్స్‌ + డైనమిక్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. మరియు హై రిజల్యూష్‌ ఆడియో సర్టిఫికేషన్‌ సహా ట్రిపుల్‌ మైక్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది.

మోటో బడ్స్ 12.4mm సింగిల్‌ డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంది. 50dB ANC సపోర్టును కలిగి ఉంది. మోటో బడ్స్‌+ 11mm ఊఫర్‌లు, 6mm' ట్వికర్లను కలిగి ఉంది. మరియు 46dB ANC సపోర్టును కలిగి ఉంది. ఈ రెండు మోడళ్లు మూడు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మోడ్‌లను కలిగి ఉన్నాయి.

మోటో బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో ANC ఆఫ్‌ మోడ్‌లో 42 గంటల ప్లేబ్యాక్‌ టైంను కలిగి ఉంటుంది. ఇందులో ఒక్కో ఇయర్‌ బడ్‌ 9 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. అదే బడ్స్‌+ ఛార్జింగ్‌ కేస్‌ 38 గంటల ప్లేబ్యాక్‌ టైం (ANC Off) కలిగి ఉండగా.. ఒక్కో ఇయర్‌బడ్ 8 గంటల ప్లే బ్యాక్‌ టైం ఇస్తుంది.

మోటో బడ్స్‌ + ఛార్జింగ్‌ కేస్‌ను వైర్‌ ఛార్జర్‌తో 60 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. అదే వైర్‌ లెస్‌ ఛార్జర్‌తో 110 నిమిషాల సమయం పడుతుంది. ఈ రెండు మోడళ్లు బ్లూటూత్‌ 5.3 పైన పనిచేస్తుంది. మోటో బడ్స్‌ యాప్‌ను సపోర్టు చేస్తాయి.

ప్రస్తుతం మోటో బడ్స్‌ యూరప్‌లో EUR 59 (భారత కరెన్సీ ప్రకారం ధర సుమారు రూ.5200) గా ఉంది. మరియు కోరల్‌ పీచ్‌, గ్లేసియర్‌ బ్లూ, కివీ గ్రీన్‌, స్టార్‌లైట్‌ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
మోటో బట్స్‌+ యూరప్‌లో EUR 149 (భారత కరెన్సీ ప్రకారం ధర సుమారు రూ.13,300) గా ఉంది.

ప్రస్తుతం ఆసియా, యూరప్, లాటిన్‌ అమెరికా, నార్త్‌ అమెరికా వంటి మార్కెట్‌ లో అందుబాటులో ఉంది. బీచ్‌ శాండ్‌, ఫారెస్ట్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌ లోనూ ఇవే మోడళ్లు, కలర్‌ వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
motorola to launch wireless earbuds for the first time in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X