Home
Gadgets

MWCలో పలకరించిన టాప్ 5 ప్రొడక్ట్స్.. 2025లో ఇవే ట్రెండ్ సెట్టర్స్!

MWC 2025: ఈ సంవత్సరం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 నిజంగా అదరగొట్టేసింది. ప్రముఖ బ్రాండ్లైన షియోమీ, హానర్, హువావే తమ సరికొత్త ప్రొడక్ట్‌లను ఒకదాని తర్వాత ఒకటిగా విడుదల చేస్తూ సందడి చేస్తున్నాయి. అంతేకాదు, శామ్‌సంగ్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలే కాదు, చిన్న కంపెనీలూ ఊహించని టెక్నాలజీతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. MWCలో ఎప్పుడూ ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటుంది, ఈసారి కూడా కొన్ని అదిరిపోయే డివైజ్‌లు వచ్చేశాయి.

పేపర్ లాంటి సన్నటి ఫోన్ల నుంచి వైఫై ఇయర్‌బడ్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లో, MWC 2025లో హైలైట్‌గా నిలిచిన టాప్ 5 ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. ఇవన్నీ కూడా వాటి క్రియేటివ్ కాన్సెప్టులతో మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. టెక్నాలజీ ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పకనే చెబుతాయి.

MWC 2025  5 Game Changing Products You Shouldn   t Miss

* షియోమీ 200-మెగాపిక్సెల్ కెమెరా ఫోన్

షియోమీ కంపెనీ ఫొటోగ్రఫీలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయింది. షియోమీ 15 అల్ట్రా ఫోన్‌లో 200MP పెరిస్కోప్ సెన్సార్ అందించింది. దీంతో పోర్ట్రెయిట్ ఫొటోలు, దూరంగా ఉన్న వస్తువులు, లైట్ తక్కువగా ఉన్న చోట కూడా పిక్చర్స్ అదిరిపోతాయి. లెన్స్ గ్లాస్ కూడా కొత్తగా డిజైన్ చేశారు, గీతలు పడకుండా ఉంటుంది, ఫొటోలు కూడా క్లారిటీగా వస్తాయి.

కెమెరానే కాదు, డిస్‌ప్లే కూడా బాగుంటుంది. 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 90W వైర్డ్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. షియోమీ వాళ్ల హైపర్‌ఓఎస్‌ని కూడా ఇంప్రూవ్ చేశారు. యానిమేషన్స్ స్మూత్‌గా ఉంటాయి, AI ఫీచర్స్ కూడా ఉన్నాయి, 'జెమినీ ఆన్ టాప్' లాంటివి కూడా ఇచ్చారు.

* ప్రపంచంలోనే మొదటి వైఫై పవర్డ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

షియోమీ బడ్స్ 5 ప్రో ప్రపంచంలోనే మొదటి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్. ఇవి బ్లూటూత్ బదులు వైఫైతో పనిచేస్తాయి. క్వాల్‌కమ్ S7 ప్రో చిప్ వల్ల, 96kHz లేదా 24-బిట్ లాస్‌లెస్ ఆడియో క్వాలిటీతో సాంగ్స్ వినొచ్చు. బ్లూటూత్‌లో మధ్య మధ్యలో సిగ్నల్ పోయే ప్రాబ్లమ్ ఉండదు.

ఫోన్ వేరే రూమ్‌లో ఉన్నా కూడా సాంగ్స్ వినొచ్చు. ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కంటే ఎక్కువ పవర్ తీసుకోవు అని షియోమీ కంపెనీ చెబుతోంది. వైర్‌లెస్ ఆడియోలో ఇదొక గేమ్ ఛేంజర్ అని అంటోంది. ఈ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వస్తే మిగతా వాటన్నిటికీ భారీ పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

* MWC 2025లో ఇదే స్లిమ్ ఫోన్..

టెక్నో కంపెనీ టెక్నో స్పార్క్ స్లిమ్ ఫోన్‌ను ప్రదర్శించింది. ఇది MWCలోనే అత్యంత సన్నని ఫోన్. కేవలం 5.75mm మందం మాత్రమే ఉంటుంది. కానీ బ్యాటరీ మాత్రం 5,200mAh పెట్టారు. సన్నని ఫోన్లలో బ్యాటరీ ప్రాబ్లమ్ ఉంటుంది కానీ దాన్ని టెక్నో దీన్ని పరిష్కరించింది. ఫోన్‌లో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు.

144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. యాపిల్ వాళ్లు కూడా ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ చేస్తారని టాక్ నడుస్తుంది. అంటే సన్నని ఫోన్ల మార్కెట్ మాత్రం మరింత హీటెక్కుతోందని చెప్పవచ్చు. దీనివల్ల యూజర్లకు ప్రయోజనం.

* హానర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

హానర్ ప్యాడ్ V9 ట్యాబ్లెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ ఇచ్చారు. దీని ధర దాదాపు 500 డాలర్లు ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎలైట్ ప్రాసెసర్ వాడారు, గేమ్స్ ఆడినా, వర్క్ చేసినా స్మూత్‌గా ఉంటుంది. 10,100mAh బ్యాటరీ కూడా ఉంది, చాలా ఐపాడ్స్ కంటే ఎక్కువ సేపు వస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌లో మెయిన్ ఫీచర్ ఏంటంటే AI పవర్డ్ ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీ. మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ మాత్రమే స్క్రీన్ క్లారిటీగా ఉంటుంది. మిగతా పార్ట్ బ్లర్ అవుతుంది. దీనివల్ల కళ్లపై స్ట్రెయిన్ తగ్గుతుంది. ఈ టెక్నాలజీ XR, VR హెడ్‌సెట్స్‌లో ఉంటుంది.

* శామ్‌సంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్

శామ్‌సంగ్ కొత్తగా మూడు బడ్జెట్ ఫ్రెండ్లీ గెలాక్సీ A-సిరీస్ ఫోన్స్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ A56 (499 డాలర్లు లేదా (రూ.43,589.57) A36 (499 డాలర్లు /రూ.43,589.57), A36(399 (రూ. 34,854.74), A26 5G (299 డాలర్లు (రూ. 26,119). ఈ మోడల్స్‌లో డిస్‌ప్లే క్వాలిటీ, కెమెరా, ప్రాసెసర్ పవర్, మెటీరియల్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి.

యాపిల్ కూడా రూ.59,900తో ఐఫోన్ 16e రిలీజ్ చేస్తున్నారు. 2025లో ప్రతి ఒక్కరి బడ్జెట్‌కి తగ్గట్టు శామ్‌సంగ్ ఫోన్ ఉండేలా చూసుకుంటోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
MWC 2025 features Xiaomi's 200MP camera phone & Wi-Fi earbuds, Tecno's slimmest phone, Honor's AI tablet, and Samsung's budget Galaxy A series, showcasing mobile innovation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X