రూ.4,999 కే ఆండ్రాయిడ్ టీవీ... ఇండియాలో రేపే లాంచ్
దేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దిగ్గజ కంపెనీలు బడ్జెట్, ప్రీమియం ధరల్లో తమ స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి.
దేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దిగ్గజ కంపెనీలు బడ్జెట్, ప్రీమియం ధరల్లో తమ స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి. ఈ ధరల్లోని టీవీలకు అత్యాధునిక ఫీచర్లను అందిస్తూ భారీ అమ్మకాలతో కోట్ల లాభాలను గడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు చాలా తక్కువ ధరలో టీవీలను విక్రిస్తున్నాయి అందులో Samy Informatics Pvt. Ltd.ఒకటి . అయితే ఈ కంపెనీ ఇప్పుడు మరోసంచలనానికి తెరలేపింది.కేవలం రూ.4,999 ధరకే ఆండ్రాయిడ్ టీవీ ను విక్రయిస్తుంది.

చీపెస్ట్ స్మార్ట్ టీవీ
Samy Informatics Pvt. Ltd జనవరి 30 న ఇండియాలో 32 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టీవీ యొక్క లాంచ్ ఈవెంట్ న్యూఢిల్లీలో 11:30 గంటలకు జరగనుంది.ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ Android TV ధర స్మార్ట్ ఫోన్ కన్నా చవకఅయినది.

TV యొక్క USP విషయానికి వస్తే
ఈ TV యొక్క USP విషయానికి వస్తే, ఇది నిరంతరాయంగా కనెక్టివిటీ మరియు స్క్రీన్ మిర్రరింగ్ కోసం అన్-ఇంటరెప్టెడ్ Wi-Fi వంటి లక్షణాలతో వస్తుంది.అదిరిపోయే ఫీచర్లతో వీక్షకులకు మంచి పిక్చర్ క్వాలిటీ ని అందిచనుంది.ఈ టీవీ ఇండియాలోనే తయారుచేయబడింది.

ధర మాత్రం రూ.5000 లోపే
టీవీ యొక్క ఫీచర్ల గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ టీవీ యొక్క ధర మాత్రం రూ.5000 లోపు ఉంటుంది అని కంపెనీ తెలిపింది .ఈ స్మార్ట్ టీవీ దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వబోతుంది టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








