OnePlus నుంచి దుమ్మురేపే హెడ్‌ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయ్!

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 6 ఒకటి.

|

ఈ ఏడాదికిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 6 ఒకటి. 2018, మే 17న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్లోకి దూసుకుపోతోంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. BGR రిపోర్ట్ చేసిన తాజా కథనం ప్రకారం వన్‌ప్లస్ అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 6టీని అక్టోబర్ 17న మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.

కొత్త వెర్షన్‌లో బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్..

కొత్త వెర్షన్‌లో బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్స్..

ఈ ఫోన్‌తో పాటు బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్‌లను కూడా వన్‌ప్లస్ లాంచ్ చేయబోతున్నట్లు సదురు వెబ్‌సైట్ పేర్కొంది. ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌లో ఫెర్ఫామెన్స్, బ్యాటరీ‌లైఫ్ ఇంకా సోనిక్ సిగ్నేచర్ పరంగా మార్పు చేర్పులు ఉండొచ్చని తెలుస్తోంది. BT32B అనే మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోన్న ఈ విప్లవాత్మక ఇయర్‌ఫోన్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.3,990 వరకు ఉండొచ్చని సమాచారం.

 

 

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 లేదా 855 సాక్..

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 లేదా 855 సాక్..

వన్‌ప్లస్ 6టీ పై ఇప్పటికే అనేక రూమార్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాస్తవానికి, వన్‌ప్లస్ తన ‘టీ' వేరియంట్ నుంచి ఇప్పటి వరకు లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌ను అంతగా అప్‌డేట్ చేయటంలేదు. దీంతో 6టీ మోడల్ డిస్‌ప్లేలో కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. పలు రిపోర్ట్స్ ప్రకారం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ 6. 28 అంగుళాల ఫుల్‌హెచ్‌డి లేదా ఫుల్‌హెచ్‌‌డి ప్లస్ స్క్రీన్ ను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది.ఈ డిస్‌ప్లేలో ఎటువంటి నాట్చెస్ ఉండకపోవచ్చట. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 లేదా 855 సాక్ పై వన్‌ప్లస్ 6టీ రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో  లభ్యం..

కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో లభ్యం..

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్ ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణంగా ఇప్పటికే వన్‌ప్లస్ 6 మోడల్ ఆండ్రాయిడ్ పీ బేటా ప్రోగ్రామ్ పై రన్ అవుతుంది. కాబట్టి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారంగా అభివృద్థి చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది.

6జీబి ఇంకా 8జీబి ర్యామ్‌తో..

6జీబి ఇంకా 8జీబి ర్యామ్‌తో..

ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6 మాదిరిగానే 6టీ మోడల్ కూడా 6జీబి ఇంకా 8జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందబాటులో ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా 64జీబి, 128జీబి ఇంకా 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను అందుబాటులో ఉంచొచ్చు. వీటితో పాటు స్టోరేజ్ పెంచుకునేందుకుగాను మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయాన్ని కూడా ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది.

పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసే అవకాశం..

పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసే అవకాశం..

కెమెరా విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఒప్పో, వివో తరహాలోనే పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో ట్రిపుల్ రేర్ కెమెరా సపోర్టుతో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మెరుగుపరచబడిన సోనీ సెన్సార్‌తో కూడిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూనిట్‌లు డివైస్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందని తెలుస్తోంది.

 

 

అక్టోబోర్ 17న మార్కెట్లోకి..

అక్టోబోర్ 17న మార్కెట్లోకి..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఏకంగా 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోన్న వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబోర్ 17న అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ ధర రూ.35,000లోపు ఉండొచ్చని సమాచారం.

 

 

Best Mobiles in India

English summary
New OnePlus Bullets Wireless could launch alongside OnePlus 6T.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X